
తాజా వార్తలు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత సారథి విరాట్ కోహ్లీ, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్‌లో నిలిచారు. బ్యాటింగ్‌లో 895 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా అతడి తర్వాతి స్థానంలో టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ (863) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లో భారత్ నుంచి బుమ్రా (797) మినహా ఎవరూ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 740 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు హార్దిక్ పాండ్య పదో స్థానంలో నిలిచాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ (122) రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్ (125) అగ్రస్థానంలో నిలిచింది. సుదీర్ఘ ఫార్మాట్లో మొదటి స్థానంలో ఉన్న భారత్ టీ20ల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్×బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు నవంబర్ 14న ప్రారంభం కానుంది. ఇటీవల బంగ్లాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను రోహిత్‌సేన 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- సుప్రీంకు చేరిన దిశ నిందితుల ఎన్కౌంటర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
