
తాజా వార్తలు
ముంబయి: భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తొమ్మిదేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. టీమ్ఇండియా బౌలర్ దీపక్ చాహర్‌ను ఉద్దేశించి అతడు 2010 అక్టోబర్‌లో ఓ ట్వీట్ చేశాడు. ‘ప్రతిభ ఉన్న యువ ఆటగాడిని చూశాను. అతడు రాజస్థాన్‌కు చెందిన దీపక్ చాహర్. అతడి పేరు గుర్తు పెట్టుకోండి. మీరు భవిష్యత్‌లో దీపక్ గొప్ప ప్రదర్శన గురించి చర్చించుకుంటారు’ అని ట్వీటాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీపక్‌పై ఆకాశ్ అంచనాను నెటిజన్లు కొనియాడుతున్నారు. మరికొందరు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వల్లే దీపక్ వెలుగులోకి వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20ల్లో దీపక్ చాహర్ హ్యాట్రిక్‌తో సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్‌తో పాటు అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలను (3.2-0-7-6) అందుకున్నాడు. ఆరు వికెట్లు పడగొట్టి నిర్ణయాత్మక పోరులో విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత మూడు రోజుల వ్యవధిలోనే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో విదర్భపై మరో హ్యాట్రిక్ సాధించాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- టీమిండియా సమష్టి విజయం
- ఉతికి ఆరేశారు
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
