close

తాజా వార్తలు

మూడో వికెట్‌ కోల్పోయిన బంగ్లా

ఇండోర్‌: భారత్‌ x బంగ్లా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్లు చెలరేగుతున్నారు. మహ్మద్‌ షమి వేసిన 18వ ఓవర్‌ చివరి బంతికి మొహమ్మద్‌ మిథున్‌‌(13; 36 బంతుల్లో 1x4) ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడింది. కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌(5; 30 బంతుల్లో)తో కలిసి మిథున్ కాసేపు వికెట్టు పడకుండా అడ్డుకున్నా చివరికి షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 20 ఓవర్లకు బంగ్లా 33/3తో నిలిచింది. భారత బౌలర్లు ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, షమి తలో వికెట్‌ తీశారు. ముష్ఫికర్‌ రహీమ్‌ క్రీజులోకి వచ్చాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.