close

తాజా వార్తలు

మోదీకి వయనాడ్‌ పరిస్థితి వివరించా:రాహుల్‌

దిల్లీ: కేరళను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. కొచ్చితో పాటు వయనాడ్‌, ఇడుక్కి, మలప్పురం, కొలికోడ్‌ జిల్లాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నియోజకవర్గం వయనాడ్‌లో వరద ఉద్ధృతి తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో అక్కడి పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించానని రాహుల్‌ తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా వయనాడ్‌లో వరద బాధితుల్ని ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. దానికి ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. కేంద్రం తరఫున అవసరమైన సహాయ, సహకారాల్ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అంతకు ముందు ట్విటర్‌ వేదికగా స్పందించిన రాహుల్‌.. వయనాడ్‌లో పరిస్థితి దారుణంగా ఉందని.. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానన్నారు. దీనిపై ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులతో మాట్లాడానని తెలిపారు. సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని కోరానన్నారు. రాష్ట్రంలో భారీ వరదల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కేరళలో భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 315 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. ప్రస్తుతం 22,165 మంది ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. మరికొంత మందిని తరలిస్తున్నామన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం ప్రకటించింది. దీంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.