
తాజా వార్తలు
అమరావతి: ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే జైలుశిక్షతో పాటు జరిమానా విధించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతను పూర్తిగా నివారించేందుకు ఈ నెల 14 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 99 రీచ్‌లలో ఇసుక తీస్తున్నామని, 137 స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేసి ఇసుక పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇసుక లభ్యతను రోజుకు 2లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని, రీచ్‌ల సంఖ్య పెరగాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. ఇసుక కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా నివారణకు ప్రత్యేకంగా డీజీని నియమించారని, ప్రతి చెక్ పోస్టు వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే జైలుశిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా విధించే ఆలోచనలో ఉన్నామని.. దీనికోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రతిపాదనలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇసుక సమస్య లేకపోయినా చంద్రబాబు దీక్షల పేరిట రాజకీయం చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- క్రమశిక్షణతో ఉంటే జనసేన గెలిచేది:పవన్
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- బాలయ్య సరసన రష్మి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
