
తాజా వార్తలు
ముంబయి : మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్‌ల మద్దతుతో అధికారం చేపడతామని చెబుతున్న శివసేన ఆ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం పూర్తయిన వెంటనే తమ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అవసరమైన దస్త్రాలతోపాటుగా, అన్నీ సర్దుకుని శుక్రవారం జరిగే సమావేశానికి హాజరుకావాలని ఎమ్మెల్యేలకు శివసేన వర్తమానం పంపింది. శనివారంలోగా మూడు పార్టీల మఖ్యనేతలు సమావేశమై పొత్తు, అధికార పంపిణీ విషయాల్లో ఏకాభిప్రాయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను సురక్షిత ప్రాంతంలో ఉంచాలని శివసేన భావిస్తోంది. గోవా, మధ్యప్రదేశ్‌లకు తరలించాలనే చర్చ వచ్చినప్పటికీ రాజస్థాన్ అయితేనే అన్ని విధాలుగా మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. గతంలో కూడా కాంగ్రెస్ తమ 44మంది ఎమ్మెల్యేలను జైపూర్‌లోని ఓ లగ్జరీ రిసార్టులో ఉంచింది.
‘ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలించాలనే విషయం ఇంకా ఖరారు కాలేదు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ లేదా ఉదయ్‌పూర్‌లకు తరలించే వీలుందని’ శివసేనకు చెందిన ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. అయితే పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిందే, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే మాత్రం ముంబయిలోనే ఉండే అవకాశముంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
