close

తాజా వార్తలు

చిన్నారుల ఆకలి తీర్చేందుకు..

సీటీఏ బృహత్తర కార్యక్రమం

చికాగో : పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు అమెరికాలోని చికాగో తెలుగు అసోసియేషన్‌ ముందుకు వచ్చింది. సీటీఏ ఆధ్వర్యంలో పేద చిన్నారుల కడుపు నింపేందుకు దాదాపు 175 మంది వాలంటీర్లు శ్రమించి 2.85 లక్షల ఆహార పొట్లాలను సిద్ధంచేశారు. ఈ మేరకు పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఆహారాన్ని అందించనున్నారు. 785 మంది చిన్నారులకు సంవత్సరంపాటు ఆహారాన్ని అందించాలని చికాగో తెలుగు అసోసియేషన్‌ సభ్యులు నిర్ణయించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సీటీఏ ముందుకు రావడం పట్ల ‘ఫీడ్‌ మై అంగ్రీ చిల్డ్రన్‌’ స్వచ్ఛంద సంస్థ అభినందనలు తెలిపింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగేంద్ర వేగా సహా ఇతర సభ్యులు పాల్గొన్నారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.