close

తాజా వార్తలు

ఇక్కడ తిన్నారంటే ఇక అంతే..

 రోజుల తరబడి ఆహారం నిల్వ

 రుచి, ఆకర్షణ కోసం రసాయనిక రంగులు

 విజిలెన్స్‌ దాడుల్లో విస్తుపోయే నిజాలు

వంటగదిలోని ఫ్రిజ్‌ను పరిశీలిస్తున్న అధికారులు

ఫ్రిజ్‌ల నిండా ముందురోజు వండగా మిగిలిపోయిన ఆహార పదార్థాలు.., రుచి, ఆకర్షణ కోసం రంగులు కలిపి రోజుల తరబడి దాచిన ఆహారం.. మళ్లీ అవే వంటకాలను వేడి చేసి ఆకలితో హోటళ్లకు వచ్చిన వారికి వడ్డించడం..నగర పరిధిలోని పలు హోటళ్లపై విచ్కీజిజిలెన్స్‌ అధికారులు జరిపిన దాడుల్లో ఇలాంటి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే..

విశాఖ: పాత గాజువాక కూడలిలోని గ్రాండ్‌ ఆల్ఫా, సినిమాహాలు కూడలిలోని ఆలీఫ్‌ రెస్టారెంట్లలో విచ్కీజిజిలెన్స్‌ డీఎస్సీ శ్రావణి, విచ్కీజిజిలెన్స్‌ సీఐ ఆర్‌.మల్లికార్జునరావు, ఆహార భద్రత అధికారి వెంకటరత్నం, విచ్కీజిజిలెన్స్‌ హెచ్‌సీ ముబారక్‌లు సోమవారం దాడులు జరిపారు. ఆల్ఫా హోటల్‌లోని రెండు ఫ్రిజ్‌ల్లో నిల్వ ఉంచిన చికెన్‌ జాయింట్లు, లాలీపాప్‌, రొయ్యల కూర, నూనెలో వేయించిన చికెన్‌, చేపల ముక్కలను చూసి అధికారులు విస్తుబోయారు. ముందురోజు బిర్యానీలోని చికెన్‌ జాయింట్లను వేరు చేసి నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఆలీఫ్‌ హోటల్‌లోనూ ఇదే పరిస్థితి అధికారులకు ఎదురైంది. వంటగదుల్లో సరైన శుభ్రత పాటించకపోవడం, రుచి కోసం ఆహార పదార్థాల్లో రంగులు కలపడం, ముందురోజు మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేసి అందించడం వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని డీఎస్పీ శ్రావణి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా హోటళ్లలోని ఆహార నిల్వలను ల్యాబొరేటరీకి పంపి, వచ్చే నివేదికను బట్టి కేసులు నమోదు చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఒకసారి వండిన పదార్థాలను ఎట్టి పరిస్థితిలోనూ నిల్వ ఉంచరాదని, కేవలం పచ్చి ఆహార పదార్థాలు మాత్రమే ఫ్రిజ్‌ల్లో ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

సీఇన్‌ రెస్టారెంట్‌లో నిల్వ ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ ఎస్పీ శ్రావణి తదితరులు

బీచ్‌ రోడ్డులోని సీఇన్‌, కారుషెడ్డు ప్రిన్స్‌లోనూ..

బీచ్‌రోడ్డులోని రుషికొండ సీఇన్‌ (రాజుగారి హోటల్‌), కారుషెడ్డు కూడలిలోని ప్రిన్స్‌ ధాబాలపైనా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేశారు. ముందురోజు వండి విక్రయించగా మిగిలిన పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లు రెండు చోట్ల గుర్తించారు. అనంతరం జీవీఎంసీ ఆహార తనిఖీ విభాగం అధికారులు జనార్దన్‌, అప్పారావులు నిల్వ పదార్థాల నమూనాలు సేకరించారు. వీరిపై కేసులు నమోదు చేస్తామన్నారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎన్‌.పార్థసారథి, డిప్యూటీ కమర్షియల్‌ టాక్స్‌ అధికారి రేవతి, సహాయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సీహెచ్‌.రాంప్రసాద్‌, కానిస్టేబుల్‌ రంగా తదితరులు దాడుల్లో పాల్గొన్నారు.

 మానస హోటల్‌పై ..

అల్లిపురంలోని మానస హోటల్‌పై విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హోటల్‌ బయట, లోపల అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి అసంతృప్తి వ్యక్తంచేశారు. విజిలెన్స్‌ సీఐ శ్రీనివాస్‌ దాడులు నిర్వహించారు. వంటగదిలో ఉన్న అపరిశుభ్రత వాతావారణాన్ని పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా హోటల్‌ను నడవడం లేదని అన్నారు. పాచిపోయిన కూరులు, శుభ్రం లేని పాతర్లను చూసి అసహనం వ్యక్తం చేశారు. పరీక్షల నిమిత్తం నమూనాలను సేకరించారు. నివేదిక ఆధారంగా హోటల్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు. దాడుల్లో సత్యకుమార్‌, జీవీఎంసీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పారావు పాల్గొన్నారు.

ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలను తీస్తున్న హోటల్‌ సిబ్బంది

పెద్దిపాలెం పేరడైజ్‌, కామత్‌ దాబా హోటళ్లలో..

16వ జాతీయ రహదారి ఆనందపురం సమీప పెద్దిపాలెం సమీప పేరడైజ్‌, కామత్‌ దాబా హోటళ్లలోనూ ఈ బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి పేరడైజ్‌ హోటల్‌లో రెండు రకాల ఆహార పదార్థాలకు నిషేధిత రంగులు కలిపి పెడుతున్నారన్న అనుమానంతో వాటి నమూనాలు సేకరించారు. హోటల్‌ నిర్వహణకు సంబంధించి పత్రాలు లేకపోవడాన్ని గుర్తించారు. కామత్‌ హోటల్‌లోని ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ చేసిన మాంసం, రొయ్యలు, ఇతర ఆహార పదార్థాలను గుర్తించారు. వాటిని ఫ్రిజ్‌ నుంచి తీసి హోటల్‌కు దూరంగా ఒక గోతిలో పాతి పెట్టించారు. పక్షి మాంసానికి నిషేధిత రంగులు జత చేసి విక్రయిస్తున్నారన్న అనుమానంతో నమూనా సేకరించారు. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ పి.నారీమణి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.