
తాజా వార్తలు
అమేఠీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఐదో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖాముఖీ తలపడుతున్న అమేఠీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోటీలో ఉన్న రాహుల్ గాంధీ ఇక్కడ అందుబాటులో లేకుండా ఎక్కడికెళ్లారంటూ స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ఆయన అమేఠీ ప్రజలను కావాలనే పట్టించుకోవడం లేదన్నారు. ఆయన వయనాడ్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో అమేఠీ ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు. ఆయన పార్లమెంటుకు సరిగా హాజరు కాని ఎంపీగా మాత్రమే కాదని, ఎన్నికలు జరుగుతున్నప్పుడు నియోజకవర్గంలో అందుబాటులో లేని అభ్యర్థిగా కూడా నిలిచారంటూ ఎద్దేవా చేశారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఇద్దరూ ఇదే స్థానం నుంచి పోటీ చేశారు. కాగా ఆ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారీటీతో రాహుల్‌గాంధీ గెలుపొందారు. అయితే రాహుల్‌పై ఇరానీ ఇప్పుడు రెండోసారి పోటీ చేస్తున్నారు. ఏడు విడతల సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేటితో ఐదు విడతల పోలింగ్ ముగియనుంది. మరో రెండు విడతల ఎన్నికల అనంతరం మే 23న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
