close

తాజా వార్తలు

ఏపీలో పింఛను అర్హత వయస్సు కుదింపు

సీఎం తొలి హామీకి సంబంధించిన జీవో జారీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ పింఛను కానుక పథకాన్ని ప్రారంభించింది. ఎన్టీఆర్‌ భరోసా పేరును వైఎస్సార్‌ పింఛను కానుకగా మార్చింది. పింఛనును రూ.2250లకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన తొలి హామీకి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం జీవోను విడుదల చేసింది. జూన్‌ 1 నుంచి కొత్త పింఛను పథకం అమలులోకి రానుంది. వికలాంగులకు రూ.3వేలు, కిడ్నీ వ్యాధితో డయాలసిస్‌ చేయించుకుంటున్న బాధితులకు రూ.10వేలు పింఛనుగా ఇవ్వనున్నారు. వృద్ధాప్య పింఛనుకు అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన ఈ పింఛను మొత్తాన్ని జులై 1 నుంచి అందించనున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.