Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 111190
      [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM [news_title_english] => NINE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS,9 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-12 20:52:46 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM - NINE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. జులై మొదటివారం నుంచి జగన్‌ ప్రజాదర్బార్‌

ప్రజల్ని నేరుగా కలిసేందుకు ఏపీ సీఎం జగన్‌ ‘ప్రజా దర్బార్‌’కు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రోజూ ఉదయం అరగంటపాటు సీఎం జగన్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చే అవకాశమున్నందున దీనికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

2. ‘కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మీరూ రండి’

ఈనెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి రావాలని మరో ముఖ్యమంత్రికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. బుధవారం మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు కేసీఆర్‌ ఫోన్‌ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. కేసీఆర్‌ ఆహ్వానానికి స్పందించిన ఫడణవీస్‌.. ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అంగీకరించారు. త్వరలోనే స్వయంగా ముంబయి వెళ్లి ఆయనను ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్‌నూ కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు.

3. ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి!

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కీలక పదవి వరించింది. ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌గా ఆమెను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రిపదవి దక్కలేదని.. అందుకే మంత్రుల ప్రమాణస్వీకారానికి కూడా ఆమె హాజరు కాలేదని ఈ మధ్య ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ను రోజా కలిశారు. వైకాపాలో అలకలు, బుజ్జగింపులు అంటూ ఏమీ ఉండవని..మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్నానన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.

4. అలాంటి పుకార్లు వ్యాప్తిచేస్తే చర్యలు: డీజీపీ

రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు అదృశ్యమవుతున్నారంటూ అసత్య ప్రచారం విస్తృతంగా వ్యాపిస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. అదృశ్య కేసుల్లో చాలా వరకు కుటుంబంలో కలహాలు, ప్రేమ వ్యవహారం, పరీక్షల్లో విఫలం కావడం తదితర కారణాల వల్లే జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాన్ని విడిచి వెళ్లిన మహిళలు, పురుషులు, తల్లిదండ్రులపై అలిగి వెళ్లిన పిల్లలు, పిల్లల సంరక్షణ దొరకని తల్లిదండ్రులు మొదలైన కారణాల వల్లే అధిక కేసులు నమోదయ్యాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

5. జనసేన వాణిని అసెంబ్లీలో విన్పిస్తా!

శాసనసభలో జనసేన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటుందని ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని.. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు మరోసారి శాసనసభలో అడుగు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జనసేన వాణిని అసెంబ్లీలో వినిపిస్తానని చెప్పారు.

6. ‘రుణమాఫీ చేయకుండా కొత్త పథకమెందుకు?’

రైతుల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తెదేపా ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన విమర్శించారు. సచివాలయంలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు.  రైతుల కోసం తెచ్చిన రుణాలను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ సరిగా అమలు చేయలేదని.. గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఇప్పుడు రైతు సంక్షేమం గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని వ్యాఖ్యానించారు.

7. ఆ కేంద్ర మంత్రులు మాకు గర్వకారణం

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జై శంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) వారికి విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డును అందించనుంది. ఈ ఏడాది ఆగష్టులో విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవంలో భాగంగా వారికి ఈ అవార్డును ఇవ్వనున్నట్లు బుధవారం జేఎన్‌యూ రిజస్ట్రార్ ప్రమోద్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. జేఎన్‌యూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ఆమోదించిందని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయం అందించే విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డు అందుకుంటున్న మొదటి వ్యక్తులు వీరే అని ప్రమోద్ కుమార్ వెల్లడించారు.

8. బెంగాల్‌లో అఖిలపక్ష భేటీకి గవర్నర్‌ పిలుపు

ఎన్నికల అనంతరం పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న ఘర్షణలపై ఆ రాష్ట్ర గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అన్ని ప్రముఖ పార్టీలకు గురువారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే అఖిల పక్ష భేటీకి హాజరు కావాలని గవర్నర్‌ లేఖలు పంపారు. గవర్నర్‌ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ స్వాగతించారు. భేటీకి సంబంధించిన లేఖ తమకు అందిందని, తాము ఈ సమావేశానికి హాజరవుతామని తెలిపారు.

9. డ్రోనుతో ఆహారం డెలివరీ!

ఆన్‌లైన్ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటో.. తొలిసారి ఆహారాన్ని డ్రోను సాయంతో చేరవేసే పరీక్షను నిర్వహించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం మీడియాకు వివరించారు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వినియోగదారుడికి హైబ్రీడ్‌ డ్రోనుతో 10 నిమిషాల్లో ఆహార పొట్లాన్ని చేరవేసే పరీక్ష విజయవంతమైందని ఆ సంస్థ తెలిపింది. ఆ డ్రోను గంటలకు 80 కి.మీ వేగంతో ప్రయాణించిందని తెలిపారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆమోదం పొందిన ఒక రిమోట్‌ సైట్‌ ప్రాంతంలో ఈ ప్రయోగాన్ని చేశామని పేర్కొంది.

10. ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కేపీ రోడ్‌లో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో పోలీసు అధికారికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య భారీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమర్చేందుకు భద్రతా బలగాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.