close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1PM

1. రాష్ట్రాభివృద్ధికి మీరేం చేస్తారో చెప్పండి

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడుల కోసమే విదేశాలకు వెళ్లామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. తాము చేసిన ప్రయత్నాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని, 5 లక్షల మందికి ఉపాధి దొరికిందని చెప్పారు. విదేశీ పర్యటనల్లో రూ.16 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని అన్నారు. 39 కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించడం సరికాదన్నారు. తనను విమర్శించేముందు రాష్ట్రాభివృద్ధి కోసం మీరేం చేస్తారో చెప్పండని అధికార పక్షాన్ని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. గుప్తనిధుల కోసం ముగ్గురి హత్య!

అనంతపురం జిల్లాలో ముగ్గురి హత్య తీవ్ర కలకలం రేపింది.తనకల్లు మండలం కొర్తికోటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కొర్తికోట శివాలయం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిని హనుమమ్మ, సత్యలక్ష్మి, శివరామిరెడ్డిగా గుర్తించారు. గుప్త నిధుల కోసమే ఈ ముగ్గురినీ చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. చంద్రబాబు నాకు అదైనా చెప్పాలి: కేశినేని

విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నా లాంటి వాడు పార్టీకి అవసరం లేదనుకుంటే.. తెదేపా అధినేత చంద్రబాబు ఆ విషయాన్నైనా నాకు తెలియజేయాలి. అలా చెప్తే తన ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తన లాంటి వాడు పార్టీ లో కొనసాగాలంటే చంద్రబాబు తన పెంపుడు కుక్కని అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ఉద్దేశించి అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కాంగ్రెస్‌ నేతల నుంచి మాకు ముప్పు ఉంది..

కర్ణాటక రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముంబయిలో తిష్ఠ వేసిన అసమ్మతి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల నుంచి తమకు ముప్పు ఉందంటూ ముంబయి పోలీసులకు లేఖ రాశారు. వారు తమని కలవకుండా చూడాలని లేఖలో కోరారు.‘‘ పవయీలోని రెనైసాన్స్‌ హోటల్‌లో ఉంటున్న మాకు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్‌, ఇతర కాంగ్రెస్ నాయకులు లేదా మరే ఇతర రాజకీయ నేతలతో కలిసే ఉద్దేశం లేదు. వారి నుంచి తీవ్ర ముప్పు ఉన్నట్లు మేం భావిస్తున్నాం. కావున వీరంతా మమ్మల్ని కలవకుండా తగు ఏర్పాట్లు చేయగలరు’’ అని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కర్నాటకీయం: కాంగ్రెస్‌ నేతల కీలక భేటీ

కర్ణాటక రాజకీయ సంక్షోభం ఎటూ తేలడం లేదు. అసమ్మతులను బుజ్జగించేందుకు సంకీర్ణ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలతో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి బలం తగ్గిందని, ప్రభుత్వం తక్షణమే బలనిరూపణ చేసుకోవాలని లేదా సీఎం రాజీనామా చేయాలని భాజపా డిమాండ్‌ చేస్తోంది. నేడు జరిగే శాసనసభ సమావేశాల్లో భాజపా తన డిమాండ్‌ను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై కాంగ్రెస్‌ పార్టీ నేడు భేటీ అయ్యింది. బెంగళూరులోని తాజ్‌ వివంతా హోటల్‌లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున ఖర్గే తదితరులు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. భవనం కూలిన ఘటనలో ఏడుగురి మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. మృతుల్లో ఆరుగురు జవాన్లు కాగా, ఒకరు సాధారణ పౌరుడు. మరో ఏడుగురు సైనికులు శిథిలాల కింద చిక్కుకొని ఉన్నట్లు అధికారులు తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కుమార్‌హట్టి ప్రాంతంలో నేలకుంగి ఓ మూడంతస్తుల భవనం ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఆ ఓవర్‌త్రోపై విలియమ్సన్‌ స్పందన

ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో అద్భుతంగా సాగిన ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ న్యూజిలాండ్‌కి విజయావకాశం ఉన్నా ఒక్క ఓవర్‌త్రో ఆ జట్టు ఆశలను సమాధి చేసింది. ఈ విషయంపై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశాడు. ‘అత్యంత కీలక సమయంలో బంతి అలా స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లడం చాలా బాధాకరం. ఇది అస్సలు బాగోలేదు. ఇలాంటి ఘటన భవిష్యత్‌లో పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఛాలెంజ్‌ల యందు ఈ ఛాలెంజ్‌ వేరయా..

ఇప్పటివరకు సెలబ్రిటీల నుంచి రాజకీయ నేతల వరకు చాలా మంది ‘బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్’లో పాల్గొన్నారు. కొందరు బాటిల్‌ కిందపడకుండా కాలితో తన్ని ఛాలెంజ్‌లో నెగ్గితే.. చేత్తో మూత తీసి నీళ్లుతాగేసి గెలిచేశాం అని చెప్పుకొన్నవారూ ఉన్నారు. అయితే వారందరికంటే కాస్త భిన్నంగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌. బాటిల్‌ క్యాప్‌ను నోటితో ఊది నీళ్లు తాగుతూ... ‘బాటిల్‌ను తన్నకండి.. నీటిని కాపాడండి’ అని పేర్కొన్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 60 వేల మందికిపైగా లైక్‌ చేశారు. సల్లూభాయ్‌కి హ్యాట్సాఫ్‌ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు ప్రస్తుతం నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 3 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.54గా ఉంది.  

10. ఆరేళ్ల వయసులోనే తొలి రచన చేసిన బాలమేథావి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.