Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 145567
      [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ @ 1 PM [news_title_english] => ONE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS,1 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 13:00:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్ @ 1 PM - ONE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. చిదంబరంపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తాత్కాలిక ఉపశమనం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు నిరాశే ఎదురైంది. ఈ కేసులో దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ధర్మాసనానికి పంపినట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. మరోవైపు చిదంబరం ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. దీంతో ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ కుంభకోణం మొత్తానికి చిదంబరం సూత్రధారిగా ఉన్నట్లు అర్థమవుతోందని దిల్లీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అటవీ పునరుజ్జీవ పనులను పరిశీలించిన కేసీఆర్‌

హరితహారంలో భాగంగా చేపట్టిన మొక్కల పెంపకం, వాటి ఫలితాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంత్రులు, అధికారుల బృందం సిద్దిపేట జిల్లాకు బయల్దేరింది. సీఎం సహా మంత్రులు, కలెక్టర్లు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి బస్సుల్లో బయల్దేరి వర్గల్ మండలం సింగాయిపల్లికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో 2016-17లో చేపట్టిన అటవీ పునరుజ్జీవన పనులను పరిశీలించారు. ఆ తర్వాత ప్రజ్ఞాపూర్ - గజ్వేల్ మార్గంలో రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా పెంచిన మొక్కలను ఈ బృందం పరిశీలించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఫర్నిచర్‌ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్ధం

తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించనందుకే.. ప్రస్తుత ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. తనను వేధించే లక్ష్యంతో ఫర్నిచర్ తరలింపు అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో రెండుసార్లు అధికారులకు, ఓసారి స్పీకర్‌కు లేఖ రాసినా వారి నుంచి తగిన స్పందన లేదని వివరించారు. ప్రభుత్వం మారిన వెంటనే జూన్ 7వ తేదిన తాను లేఖ రాశానని... ఆ తర్వాత స్పీకర్‌కు కూడా లేఖ రాశానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అవి రసాయనాలు కాదు.. మురుగు నీరే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ప్రముఖులకు పంపిన పార్శిళ్లపై పోలీసులు నిగ్గుతేల్చారు. పార్శిల్‌లో ఉన్నది రసాయనాలు కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిన్న పోస్టులో వచ్చిన సీసాల ద్రావణాన్ని పరీక్షల కోసం పోలీసులు ల్యాబ్‌కు పంపారు. అందులో ఉన్నది మురుగు నీరు అని ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ తేల్చిచెప్పింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే అజ్ఞాతవ్యక్తులు ఈ పనికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్శిల్‌ పంపిన అజ్ఞాతవ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీబీఐ చర్యను ఖండించిన ప్రియాంక గాంధీ

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత చిదంబరంపై సీబీఐ చర్యలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఖండించారు. ఏళ్లపాటు దేశానికి సేవ చేసిన వ్యక్తిని అలా అగౌరవపరచడం అన్యాయమన్నారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘అత్యంత గౌరవనీయులైన రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం. దశాబ్దాలుగా ఆయన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఆర్థిక, హోం మంత్రిగా ఆయన ఎన్నో విలువైన సేవలు చేశారు. నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడే వ్యక్తి ఆయన. ఇప్పటి ప్రభుత్వ వైఫల్యాలను బాహాటంగా ఎండగడుతున్నారు’అని ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యోగి సర్కారులో రాజీనామాల రగడ

ఉత్తర్ ప్రదేశ్‌లో సీనియర్‌ మంత్రుల రాజీనామాల రగడ మొదలైంది. 29నెలల యోగి ప్రభుత్వంలో ఎట్టకేలకు నేడు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. భాజపా వర్గాలు వివరాల ప్రకారం 24 మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. అయితే భాజపాలో ఉన్న వయసు నిబంధన కారణంగా 75 ఏళ్లు నిండిన వారు పదవుల్లో ఉండకూడదు. ఈ నేపథ్యంలో మంత్రులుగా ఉన్న ఆరుగురు సీనియర్లు మంగళవారం రాజీనామాలు సమర్పించినట్లు తెలుస్తోంది. వారిలో ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేశ్‌ అగర్వాల్‌(74), ప్రాథమిక విద్యాశాఖ మంత్రి అనుపమ జైస్వాల్‌ల రాజీనామాలను ఆమోదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సౌదీ మహిళలకు ‘ప్రయాణ’స్వేచ్ఛ

సౌదీ అరేబియాలో ఇటీవలి కాలంలో మహిళల పట్ల వివక్ష తగ్గుతోంది. పురుషులతో సమానంగా వారికి హక్కులు కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. తాజాగా సౌదీ మహిళలకు ‘ప్రయాణ స్వేచ్ఛ’ లభించింది. 21ఏళ్లు పైబడిన మహిళలు ఇకపై తమ ఇంట్లోని పురుషుల అనుమతి లేకుండానే పాస్‌పోర్టు తీసుకోవచ్చు. విదేశాలకు కూడా వెళ్లొచ్చు. ఈ సంస్కరణలను మంగళవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఆగస్టు ఆరంభంలో ఈ సంస్కరణలను సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి వాటిని అమలు చేస్తున్నట్లు సౌదీ పాస్‌పోర్టు విభాగం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నిధుల జమకీ ఖాతాదారుడి అనుమతి కావాల్సిందే?

ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ చేయాలంటే ఆ ఖాతాదారుడి అనుమతి సైతం తీసుకొనే విధానాన్ని బ్యాంకులు త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలోనే వెల్లడించినా.. తాజాగా దీనికి సంబంధించిన విధివిధానాలపై ఆర్బీఐకి లేఖ రాసినట్లు తెలిసింది. నూతన విధానంలో ఎవరైనా ఏదైనా ఖాతాలో డబ్బులు జమ చేయాలంటే ముందు సదరు ఖాతాదారుడికి నోటిఫై చేస్తామని.. వారు అనుమతిస్తేనే డబ్బులు డిపాజిట్‌ అవుతాయని దీంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆసక్తికరంగా సహాయ కోచ్‌ ఇంటర్వ్యూలు

ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీ టీమిండియా సహాయ కోచ్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లతో పాటు అడ్మినిష్ట్రేటివ్‌ మేనేజర్‌ను ఎంపిక చేయనున్నారు. దీనిలో భాగంగా సెలక్షన్‌ కమిటీ 16 మందికి ముఖాముఖీ నిర్వహించింది. ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌, దక్షిణాఫ్రికా ఆటగాడు జాంటీ రోడ్స్‌ మంగళవారం స్కైప్‌లో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. సంజయ్‌ బంగర్‌కు విక్రమ్‌ రాఠోడ్‌, ప్రవీణ్‌ ఆమ్రే నుంచి తీవ్ర పోటీ నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పార్లమెంటులో ప్లాస్టిక్‌ నిషేధం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.