Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000060
            [news_title_telugu_html] => 

పోలవరంపై కేంద్రానికి పీపీఏ నివేదిక

[news_title_telugu] => పోలవరంపై కేంద్రానికి పీపీఏ నివేదిక [news_title_english] => PPA Submits Report On Polavaram [news_short_description] => పోలవరంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నివేదిక అందజేసింది. ప్రాజెక్టు ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని.. ఏపీ ప్రభుత్వ వైఖరితో ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులూ తలెత్తుతాయని పీపీఏ పేర్కొంది. 12 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌.... [news_tags_keywords] => Polavaram,PPA,AP News [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 8skuNhgqwkQ [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 00:11:14 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పోలవరంపై కేంద్రానికి పీపీఏ నివేదిక - PPA Submits Report On Polavaram - EENADU
close

తాజా వార్తలు

పోలవరంపై కేంద్రానికి పీపీఏ నివేదిక

దిల్లీ: పోలవరంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నివేదిక అందజేసింది. ప్రాజెక్టు ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని.. ఏపీ ప్రభుత్వ వైఖరితో ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులూ తలెత్తుతాయని పీపీఏ పేర్కొంది. 12 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల జరిగే నష్టాలను నివేదికలో పీపీఏ సవివరంగా పొందుపరిచింది. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో మరింత జాప్యం జరిగే అవకాశముందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

జాప్యం కొనసాగితే పోలవరం ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతాయని నివేదికలో పీపీఏ పేర్కొంది. దీంతో పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు భారం అవుతాయని అభిప్రాయపడింది. తక్కువ ధరకు కాంట్రాక్టర్‌ వస్తారన్న నమ్మకం కూడా లేదని.. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం అధికంగా ఉంటుందని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించడమే మంచిదని అథారిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కేంద్రానికి పంపిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పీపీఏ పంపింది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.