
తాజా వార్తలు
అమరావతి: జగన్ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని మార్చడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కృత్రిమ కొరత ఏర్పడిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈనెల 14న తాను తలపెట్టిన దీక్షకు అన్ని వర్గాలు మద్దతివ్వాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఆర్టీసీ సమస్యపై అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్నట్లుగానే రాష్ట్రంలోనూ ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. జగన్ ప్రభుత్వ వైఖరితో 30లక్షల మంది కార్మికులు ఆకలితో అలమటించే పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. పనులు దొరక్క.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందని.. దీంతో కొందరు అర్ధాంతరంగా చదువులు ఆపేయించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. భార్యా పిల్లలకు కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నామనే వేదనతో సుమారు 40 మంది బలవన్మరణాల పాలయ్యారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఇసుక కృత్రిమ కొరతతో పెరిగిన రేట్ల వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైందని విమర్శించారు. పనులు కోల్పోయిన 125 వృత్తులవారందరీకి మనోధైర్యం కలిగించి ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి అమలు చేయాలనే డిమాండ్‌తో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఈనెల 14న 12 గంటల పాటు నిరసన దీక్షను చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఉపాధి చూపే వరకు కార్మికులకు రూ.10 వేల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరితో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇప్పించేందుకే తన దీక్ష అని చంద్రబాబు స్పష్టం చేసారు. ఎగువ రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని ఇసుక కొరత ఇక్కడే ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
