close

తాజా వార్తలు

యూపీ పోలీసుల హర్స్‌రైడింగ్ అదుర్స్‌!

లఖ్‌నవూ: సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు నేపథ్యంలో ఇటీవల యూపీలోని ఫెరోజాబాద్ పోలీసులు చేసిన మాక్‌డ్రిల్‌ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గుర్రాలు లేకున్నా వాటిపై పహారా చేస్తున్నట్లుగా వారు చేసిన వ్యాయామం అందరినీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియోని యూపీకి చెందిన ఓ రాజకీయ పార్టీ నాయకుడు ట్విటర్‌ ద్వారా పోస్ట్‌ చేశారు. దీనిపై ఇన్‌స్పెక్టర్‌ రామ ఇక్సా మాట్లాడుతూ..‘అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అల్లర్లను నివారించేందుకు నవంబర్ 8న జిల్లా ఈ మాక్‌డ్రిల్‌ నిర్వహించాం. అందులో భాగంగా గుర్రంపై పహారా చేసే వ్యాయమం చేశాం. కాకపోతే ఇక్కడ గుర్రాలు అందుబాటులో లేకపోవడంతో ఇలా లాఠీని కాళ్ల మధ్యలో పెట్టుకుని గుర్రంలా భావించి చేశాం’ అని వివరించారు. ఈ వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు ఇలాంటి వ్యాయామం కూడా ఉంటుందా అంటూ చమత్కారంగా స్పందించారు. 

 

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.