
తాజా వార్తలు
1. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం: అదనపు ఏజీ
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సమ్మె చట్ట విరుద్ధమని అదనపు ఏజీ రామచందర్ రావు వాదించారు. సమ్మెకు వెళ్లే ముందు కార్మికులు నోటీసులు కూడా ఇవ్వలేదని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే హక్కు ఎవరికి ఉందని ప్రశ్నించింది. ఆ హక్కు కేవలం కార్మిక న్యాయస్థానానికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. దేశ సమాఖ్య విధానానికి ఆత్మ.. రాజ్యసభ
భారత సమాఖ్య విధానానికి రాజ్యసభ ఆత్మవంటిదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. భారత రాజకీయాల్లో పెద్దలసభ పాత్రపై ప్రసంగించారు. ‘రాజ్యసభ శాశ్వత సభ. ఇది ఎప్పటికీ రద్దు కాదు. ఇక్కడకు సభ్యులు వస్తుంటారు.. వెళ్తుంటారు. మన దేశ సమాఖ్య విధానానికి ఈ సభ ఆత్మవంటిది’ అని మోదీ కొనియాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. జేఎన్‌యూ డిమాండ్లపై కమిటీ ఏర్పాటు
జేఎన్‌యూ విద్యార్థుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మానవ వనరుల మంత్రిత్వ విద్యాశాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ‘విద్యార్థులతో చర్చలు జరిపి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీకి కావల్సిన సహకారాన్ని యూజీసీ అందిస్తుంది’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అశ్వత్థామకు పెరిగిన షుగర్, బీపీ
ఆస్పత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి మధుమేహంతో బాధపడుతున్నారని.. ఈ సమయంలో ఆహారం తీసుకోకపోతే ఇద్దరి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఉస్మానియా ఆస్పత్రి ఆర్ఎంవో రఫీ తెలిపారు. దీక్ష విరమించి ఆహారం తీసుకోవాలని వారిని కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం షుగర్, బీపీ స్థాయులు బాగా పెరిగిపోయాయని..సెలైన్స్, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు ఆయన వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఇప్పటికైనా జగన్ వాస్తవాలు గ్రహించారు:పవన్
రాష్ట్రంలో ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్లో వ్యాఖ్యానించారు. ఇసుక అందుబాటులోకి రావటంతోపాటు, పంపిణీ కేంద్రాల సమాచారంపై ఓ అంగ్ల దినపత్రికలో వచ్చిన ప్రభుత్వ ప్రకటనను పవన్ ట్విటర్లో ఉంచారు. ముఖ్యమంత్రికి నిజాలు తెలియజేయటంలో సహకరించిన మీడియా, రాజకీయపక్షాలు, సంస్థలు, వ్యక్తులకు పవన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. వ్యవసాయ మిషన్‌పై సీఎం జగన్ సమీక్ష
రాష్ట్ర వ్యవసాయ మిషన్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీకి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి, బాలినేని, వ్యవసాయ మిషన్ ఛైర్మన్ నాగిరెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్ వెబ్‌సైట్‌ను ఈ సందర్భంగా సీఎం ప్రారంభించారు. కొత్తగా 207 మార్కెట్ కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. సుప్రీంకోర్టును ఆశ్రయించిన చిదంబరం
‘ఐఎన్ఎక్స్ మీడియా’ కేసులో తనకు దిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాది కపిల్ సిబల్ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారణకు అంగీకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. సరి -బేసి విధానం పొడిగించం: కేజ్రీవాల్
దేశ రాజధాని దిల్లీ నగరంలో వాయు కాలుష్య తీవ్రత కొంత మేర తగ్గిందనీ.. అందుకే ‘సరి-బేసి’ విధానాన్ని పొడిగించాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. దిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరడంతో నవంబర్ 4 నుంచి 15 వరకు ఈ విధానాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పాటు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. లోతైన చర్చకు రాజ్యసభే సరైనది: మన్మోహన్
రాజ్యసభలో 1991 నుంచి సభ్యుడిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తెలిపారు. ఈ సభలో విపక్ష నాయకుడిగా..సభా నాయకుడిగా ఉండే అదృష్టం తనకు దక్కిందన్నారు. రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఎగువసభలో ఆయన మాట్లాడారు. లోక్‌సభతో పోల్చితే లోతైన చర్చ జరిపేందుకు రాజ్యసభలో అవకాశం ఉంటుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. నష్టాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకుల్లో సాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలో సూచీలు ఉత్సాహంగా కనబడినా.. ఆ తర్వాత కీలక రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాల ముందు ఆ జోరు కొనసాగించలేకపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 72 పాయింట్ల నష్టంతో 40,284 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 11 పాయింట్లు నష్టపోయి 11,884 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71,79గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- శరణార్థులకు పౌరసత్వం
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
