close

తాజా వార్తలు

నింగి నుంచి తొంగి చూస్తే!

పరిసరాల్ని ఎప్పుడూ మన కళ్లతో  చూస్తూనే ఉంటాం... ఈ కెమెరా కళ్లు అంతరిక్షం నుంచి భూమిని చూశాయి... అదీ అమెరికా అంతరిక్ష  పరిశోధనా సంస్థ నాసావి...
ఈ చిత్రాలన్నింటినీ ఓ పుస్తక రూపంలో నాసా తాజాగా విడుదల చుసింది... దానిపేరు ‘ఎర్త్‌’. భూమి, నీరు, ఆకాశం, వాతావరణం లాంటి అన్ని అంశాలూ పైనుంచి ఎలా కనిపిస్తాయో అందులో  పొందుపరిచింది.
దాంట్లోని ఫోటోలే మన కనులకు విందు చేసేందుకు ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి!

* కెనడాలోని ఓ డెల్టా ప్రాంతంలో మంచు మధ్యలోంచి నీటి దారులిలా...


 


* ఐస్‌లాండ్‌లోని హోలుహ్రౌన్‌ లావా ఫీల్డ్‌ ఇది. అంతరిక్షంలోకి ఇలా లావాను కక్కుతూ ఎర్రగా దర్శనమిచ్చింది.


 


* మేఘాల మధ్యలోంచి కనిపిస్తున్నవి అలాస్కాలో ఉన్న ‘ది ఐలాండ్స్‌ ఆఫ్‌ ద ఫోర్‌ మౌంటేన్స్‌’.


 


* బామాస్‌లోని ఓ దీవిలో ఉన్న మంచులోకి చొచ్చుకెళ్లిన అలలు


 


* బ్లాస్టిక్‌ సముద్రంలో... కైనో బ్యాక్టీరియాల వల్ల ఏర్పడిన రంగులిలా చిత్రంగా కెమెరా కళ్లకు చిక్కాయి.


 


* చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రావిన్సులో నేల ఇలా ఎరుపు, పచ్చ, గోధుమ రంగులు కలగలిపి కనిపించింది.


 


* న్యూజీలాండ్‌లోని ఎగ్‌మౌంట్‌  నేషనల్‌ పార్కులో మన వేలి ముద్ర ఆకారంలో ఉన్న మౌంట్‌ తారనాకి.


 


* అంటార్కిటికాలో అత్యంత ఉప్పుతో నిండి ఉండే ప్రాంతం డాన్‌ జువాన్‌ పాండ్‌.


 


* మంగోలియాలోని ఎడారిలో ఎత్తయిన  ఇసుక తిన్నెల మధ్యలో ఒదిగిపోయిన కొలనులిలా...


 


* అమెరికాలోని కొలరెడో నది పరీవాహక ప్రాంతం ఇలా...


 


* కెనడాలో లోయల్లో పచ్చికలపై పరుచుకున్న మంచు అచ్చం మేఘాల్లాగే దర్శనమిచ్చిందిలా...


 


* భూమి పై వాతావరణంలో వంపులు వంపులు తిరిగి అందంగా పరుచుకున్న మేఘాలు


 


* చైనా, కజకిస్థాన్‌ సరిహద్దుల్లోని పంటలు పండించే నేలలిలా...


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.