
తాజా వార్తలు
దిల్లీ: భారత్‌కు చెందిన ఐదుగురు నావికులు నైజీరియాలో అపహరణకు గురైనట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ నేడు వెల్లడించారు. నైజీరియా ప్రభుత్వంతో సంప్రదించి నావికులను విడిపించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అక్కడి భారత హైకమిషనర్‌ను ఆదేశించారు.
రెండు వారాల క్రితం నైజీరియాలోని బోనీ ఔటర్ ఆంకరేజ్ నుంచి బయల్దేరిన ఓ ఓడపై సముద్రపు దొంగలు దాడి చేశారు. ఓడలో మొత్తం 15 మంది సిబ్బంది ఉండగా.. ఏడుగురిని దొంగలు ఎత్తుకెళ్లారు. కాగా.. వీరిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. అపహరణకు గురైన నావికుల్లో ఒకరైన సుదీప్ చౌదరీ భార్య భాగ్యశ్రీ దాస్ ఇటీవల ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు నావికులకు విడిపించాలంటూ వారి కుటుంబసభ్యులు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను సాయం కోరారు. దీనిపై సుష్మా నేడు స్పందించారు. నావికుల విడుదలపై నైజీరియా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పోలీసులపై పూల జల్లు
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
