Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102878
            [news_title_telugu_html] => 

ఆ రెండు జట్లకే విజయావకాశాలు: హర్భజన్‌

[news_title_telugu] => ఆ రెండు జట్లకే విజయావకాశాలు: హర్భజన్‌ [news_title_english] => Harbhajan Singh tells that England and India are favorite teams [news_short_description] => ఈసారి ప్రపంచప్‌ టోర్నీలో విజేతగా నిలవబోయే ఫేవరెట్‌ జట్లలో ఇంగ్లాండ్‌ తర్వాత టీమ్‌ఇండియాకే ఎక్కువ అవకాశాలున్నాయని సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు... [news_tags_keywords] => Cricket,World Cup 2019,Team India ,England ,Virat Kohli [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 00:16:56 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆ రెండు జట్లకే విజయావకాశాలు: హర్భజన్‌ - Harbhajan Singh tells that England and India are favorite teams - EENADU
close

తాజా వార్తలు

ఆ రెండు జట్లకే విజయావకాశాలు: హర్భజన్‌

ముంబయి: ఈసారి ప్రపంచప్‌ టోర్నీలో విజేతగా నిలవబోయే ఫేవరెట్‌ జట్లలో ఇంగ్లాండ్‌ తర్వాత టీమ్‌ఇండియాకే ఎక్కువ అవకాశాలున్నాయని సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌ తొలి ఫేవరెట్‌గా ఉందని చెప్పాడు. అయితే భారత్‌లో కోహ్లీసేనపైనా భారీ అంచనాలు ఉన్నాయని భజ్జీ పేర్కొన్నాడు. 1983లో తొలిసారి ఇక్కడే భారత్‌ విశ్వవిజేతగా నిలిచిందని, ఈ నేపథ్యంలో మూడోసారి కప్పును ఎగరేసుకుపోయే అవకాశాలు ఉన్నాయన్నాడు. (1983,2011లో భారత్‌ ప్రపంచకప్‌ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.)

అలాగే ప్రపంచకప్‌లో ఒత్తిడి కీలక పాత్ర పోషిస్తుందని, అది విరాట్‌కోహ్లీ ఒక్కడిపైనే కాకుండా టీమ్‌ఇండియా ఆటగాళ్లందరిపైనా ఉంటుందని చెప్పాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఒత్తిడి కాస్త తగ్గిందని భజ్జీ వివరించాడు. అయితే ప్రస్తుతం తిరుగులేని శక్తిగా మారిన ఇంగ్లాండ్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం లభించిందని తెలిపాడు. గత 20 ఏళ్లుగా విశ్వవిజేతగా నిలుస్తున్న ఆసీస్‌ జట్టును 2011లో భారత్‌ నిలువరించిన సంగతి గుర్తుచేశాడు. భజ్జీ చివరిసారి 2016లో వన్డే మ్యాచ్‌ ఆడగా మూడుసార్లు వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆడాడు. అందులో భారత్‌ రెండుసార్లు ఫైనల్‌ చేరి ఒకసారి విశ్వవిజేతగా నిలిచింది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.