Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102913
            [news_title_telugu_html] => 

ప్రపంచకప్‌లో కోహ్లీయే నంబర్‌ వన్‌: మార్క్‌వా

[news_title_telugu] => ప్రపంచకప్‌లో కోహ్లీయే నంబర్‌ వన్‌: మార్క్‌వా [news_title_english] => [news_short_description] => వచ్చేవారం ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ టోర్నీలో అన్ని జట్లలో కలిపి టాప్‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ నంబర్‌వన్‌ ఆటగాడని ఆసీస్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ మార్క్‌వా తెలిపాడు... [news_tags_keywords] => Cricket,World Cup 2019,Virat Kohli ,David Warner [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 22:19:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రపంచకప్‌లో కోహ్లీయే నంబర్‌ వన్‌: మార్క్‌వా - EENADU
close

తాజా వార్తలు

ప్రపంచకప్‌లో కోహ్లీయే నంబర్‌ వన్‌: మార్క్‌వా


జోస్‌ బట్లర్‌, డేవిడ్‌ వార్నర్‌ తర్వాతి స్థానాల్లో

మెల్బోర్న్‌: వచ్చేవారం ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ టోర్నీలో అన్ని జట్లలో కలిపి టాప్‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ నంబర్‌వన్‌ ఆటగాడని ఆసీస్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ మార్క్‌వా తెలిపాడు. ఇంగ్లాండ్‌ వికెట్‌కీపర్‌ జోస్‌బట్లర్‌, ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌వార్నర్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలుస్తారని తన అభిప్రాయం వెల్లడించాడు.

మార్క్‌వా శుక్రవారం ఓ క్రికెట్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఈ ప్రపంచకప్‌లో ‘కోహ్లీ కచ్చితంగా నంబర్‌ వన్‌ ఆటగాడు’ అని పేర్కొన్నాడు. వన్డేల్లో 59.57 సగటుతో 41 శతకాలు సాధించడంతో కోహ్లీ ఆల్‌టైమ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ తొలిస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీని నంబర్‌వన్‌ ఆటగాడిగా వా ఎంపిక చేశాడు. అనంతరం ఇంగ్లాండ్‌ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ని రెండో అత్యుత్తమ ఆటగాడిగా ఎంపిక చేశాడు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బట్లర్‌ అద్భుత ఫామ్‌లో కనిపించాడు. 50 బంతుల్లోనే శతకం సాధించి ప్రపంచకప్‌ ముందు ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక పంపాడు. దీంతో అతడిని రెండో ఆటగాడిగా పేర్కొన్నాడు. 

ఇక మూడో ఆటగాడిగా ఆస్ట్రేలియా డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌వార్నర్‌ని ఎంపిక చేశాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురైన విషయం తెలిసిందే. తిరిగి ఐపీఎల్‌లో చేరి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున 12 మ్యాచుల్లోనే అత్యధిక 692 పరుగులు సాధించాడు. దీంతో ప్రపంచకప్‌లో తన ఆట ఎలా ఉండబోతోందో ముందే రుచిచూపించాడు వార్నర్‌. కాగా మే 30న ఓవల్‌ మైదానంలో 2019 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.