close

తాజా వార్తలు

దిల్లీలో అఖిలపక్ష భేటీ ప్రారంభం

దిల్లీ: దిల్లీలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. ఉభయ సభల్లో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ భవనంలోని లైబ్రరీ హాలుకు చేరుకున్నారు. జమిలి ఎన్నికలు, ఈ ఏడాది జరిగే మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలు, తదితర అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో జరిగే ఈ భేటీకి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షాతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. ఏపీ సీఎం జగన్‌ కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్‌ భవనం వద్దకు చేరుకున్నారు. 

‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ నినాదాన్ని దేశవ్యాప్తంగా చర్చలోకి కేంద్రం తీసుకొస్తోంది. వచ్చే మూడేళ్ల కాలంలో మూడు నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే ఆస్కారం ఉన్నందున జమిలి ఎన్నికలపై ఒక్కోపార్టీ విధానం ఎలా ఉంది? ఒకేసారి ఎన్నికల నిర్వహణకు చర్యలు ఎలా తీసుకోవాలి? న్యాయపరమైన చిక్కులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై చర్చించనున్నారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని సమీక్షిస్తూనే కొత్త కార్యక్రమాలతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కీలకంగా చర్చించనున్నారు. జాతిపిత మహాత్ముడికి ఒక్కో రాష్ట్రంతో ఒక్కోవిధమైన అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయన సందర్శించిన ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపైనా చర్చించనున్నారు.

ఈ భేటీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌, జేయూడీయూ అధ్యక్షుడు నితీష్‌కుమార్‌, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌, శిరోమణి అకాళీదల్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, లోక్‌జనశక్తి అధినేత రాంవిలాస్‌ పాసవాన్‌, పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ తదితరులు పాల్గొన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.