close

తాజా వార్తలు

ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని రద్దును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  ఈ అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం  జారీచేసిన ఉత్తర్వులను ఎం.ఎల్‌. శర్మ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌ను రెండుగా విభజిస్తూ రూపొందించిన బిల్లును నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. వాడీ వేడి చర్చ అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ రోజు లోక్‌సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.