Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145529
            [news_title_telugu_html] => 

సీబీఐ చర్యను ఖండించిన ప్రియాంక గాంధీ

[news_title_telugu] => సీబీఐ చర్యను ఖండించిన ప్రియాంక గాంధీ [news_title_english] => Chidambaram being shamefully hunted down tweets Priyanka Vadra Gandhi [news_short_description] => మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత చిదంబరంపై సీబీఐ తీసుకుంటున్న చర్యలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ... [news_tags_keywords] => Priyanka Gandhi,Chidambaram,INX Media Case [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => FlTzmzLbJhM [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 11:20:42 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సీబీఐ చర్యను ఖండించిన ప్రియాంక గాంధీ - Chidambaram being shamefully hunted down tweets Priyanka Vadra Gandhi - EENADU
close

తాజా వార్తలు

సీబీఐ చర్యను ఖండించిన ప్రియాంక గాంధీ

దిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత చిదంబరంపై సీబీఐ చర్యలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఖండించారు. ఏళ్లపాటు దేశానికి సేవ చేసిన వ్యక్తిని అలా అగౌరవపరచడం అన్యాయమన్నారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘అత్యంత గౌరవనీయులైన రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం. దశాబ్దాలుగా ఆయన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఆర్థిక, హోం మంత్రిగా ఆయన ఎన్నో విలువైన సేవలు చేశారు. నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడే వ్యక్తి ఆయన. ఇప్పటి ప్రభుత్వ వైఫల్యాలను బాహాటంగా ఎండగడుతున్నారు’అని ట్వీట్ చేశారు.

‘కొందరు పిరికిపందల వల్లే ఇలా నిజాలు మాట్లాడే వారిపై నిందలు పడుతున్నాయి. ఆయన పట్ల సీబీఐ తీరు అవమానకరమైంది. మేం ఆయనకు మద్దతుగా నిలుస్తాం. న్యాయం కోసం ఆయన తరఫున పోరాడతాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బెదరం’అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనిపై ఆయన వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా ఉపశమనం లభించలేదు. ఆయన పిటిషన్‌పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత చూపలేదు. బుధవారం ఉదయం ఆ పిటషన్‌ను దాఖలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో చిదంబరం కోసం సీబీఐతో పాటు ఈడీ బృందాలు కూడా గాలిస్తున్నాయి.
 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.