Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000565
            [news_title_telugu_html] => 

యూఏఈ పురస్కారం అందుకున్న మోదీ

[news_title_telugu] => యూఏఈ పురస్కారం అందుకున్న మోదీ [news_title_english] => UAE honours PM Modi with highest civilian award [news_short_description] => యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది. అబుదాబి యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయోద్‌ అల్‌ నాహ్యన్‌ ప్రధాని మోదీని ఆ దేశ అత్యున్నత [news_tags_keywords] => Modi,UAE,Order of Zayed,highest civilian award [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 22:14:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
యూఏఈ పురస్కారం అందుకున్న మోదీ - UAE honours PM Modi with highest civilian award - EENADU
close

తాజా వార్తలు

యూఏఈ పురస్కారం అందుకున్న మోదీ

అబుదాబి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది. అబుదాబి యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయోద్‌ అల్‌ నాహ్యన్‌ ప్రధాని మోదీని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌’తో సత్కరించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసినందుకు గానూ మోదీకి ఈ అవార్డును అందించారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో యూఏఈ మోదీకి అత్యున్నత పురస్కారానికి ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ఎన్నడూ లేనంతగా భారత్‌తో మా బంధాలు బలపడ్డాయి. అందుకోసం నా మిత్రుడు, ప్రధాని మోదీ ఎంతగానో కృషిచేశారు. ఆయన చేసిన ఈ కృషికి గాను ఆయనకు జాయెద్‌ పురస్కారాన్ని(దేశంలో అత్యున్నతమైనది) ప్రకటిస్తున్నాను. ప్రధాని మోదీ అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేశారు’ అని అబుదాబి యువరాజు జాయెద్‌ అల్‌ నాహ్యన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ప్రధాని ఆ దేశంలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. 

ఇప్పటి వరకూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌,  ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు సర్కోజీ , జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 తదితర ప్రపంచ నేతలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మోదీ కూడా చోటు దక్కించుకున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.