Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001030
            [news_title_telugu_html] => 

జీ-7 సదస్సుకు బయలుదేరిన మోదీ

[news_title_telugu] => జీ-7 సదస్సుకు బయలుదేరిన మోదీ [news_title_english] => PM Modi leaves for France to attend the G7 from Bahrain [news_short_description] => బహ్రెయిన్‌ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి నుంచి నేరుగా ఫ్రాన్స్‌ బయలుదేరారు. ఈరోజు సాయంత్రం జరగబోయే జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొంటారు.... [news_tags_keywords] => Modi,Bahrain,G-7,Trump,France [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 12:51:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జీ-7 సదస్సుకు బయలుదేరిన మోదీ - PM Modi leaves for France to attend the G7 from Bahrain - EENADU
close

తాజా వార్తలు

జీ-7 సదస్సుకు బయలుదేరిన మోదీ

మనామా(బహ్రెయిన్‌): బహ్రెయిన్‌ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి నుంచి నేరుగా ఫ్రాన్స్‌ బయలుదేరారు. ఈరోజు జరగబోయే జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొంటారు. అంతకు ముందు బహ్రెయిన్‌ రాజధాని మనామాలో కొత్త హంగులతో పునరుద్ధరించిన శ్రీనాథ్‌జీ ఆలయాన్ని ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శనివారం బహ్రెయిన్‌ రాజు హమద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ద కింగ్‌ హమద్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది రెనైసాన్స్‌’తో మోదీని సత్కరించారు. మనామాలోని బహ్రెయిన్‌ జాతీయ స్టేడియంలో వేలమంది భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జి-7 సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొంటారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు సమాచారం. భారత్‌లో అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని, తమ వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని ట్రంప్‌ కోరనున్నట్టు అధికారులు తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.