Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009718
            [news_title_telugu_html] => 

మధ్యవర్తిత్వం కోసం ‘పాక్‌’లాట

[news_title_telugu] => మధ్యవర్తిత్వం కోసం ‘పాక్‌’లాట [news_title_english] => Third party reconciliation only option says Pakistan foreign minister [news_short_description] => కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేయడాన్ని పాకిస్థాన్‌ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. వీలుచిక్కినప్పుడల్లా దీనిపై ఏదో ఒక చోట మాట్లాడుతూనే ఉంది.  ఇరు దేశాల మధ్య చర్చలు సాధ్యం కావని,  మధ్యవర్తిత్వం కావాలని ............... [news_tags_keywords] => Mehmood Qureshi ,Pakistan,Article 370 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 12:05:27 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మధ్యవర్తిత్వం కోసం ‘పాక్‌’లాట - Third party reconciliation only option says Pakistan foreign minister - EENADU
close

తాజా వార్తలు

మధ్యవర్తిత్వం కోసం ‘పాక్‌’లాట

చర్చలు కుదరవన్న ఆ దేశ విదేశాంగ మంత్రి

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేయడాన్ని పాకిస్థాన్‌ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. వీలుచిక్కినప్పుడల్లా దీనిపై ఏదో ఒక చోట మాట్లాడుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు సాధ్యం కావని, మధ్యవర్తిత్వం కావాలని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహమూద్‌ ఖురేషీ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్సీ) 42వ సదస్సు వేదికగా పాక్‌ ఆరోపణలను భారత్‌ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. అయితే, రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, చర్చల ద్వారా అవి పరిష్కారమవుతాయని ఐరాస పేర్కొంది. ఆ వ్యాఖ్యలను పాక్‌ మంత్రి ఉటంకిస్తూ చర్చల వల్ల ఫలితమేమీ ఉండదన్నారు.

‘భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు, చర్చలు సాధ్యం కాని పని. ఇరు దేశాల ఉద్రిక్తతలు మధ్య వర్తిత్వం ద్వారానే అది పరిష్కారమవుతాయి’ అని ఖురేషీ అన్నారు. భారత్‌ మాత్రం ఈ విషయంలో ఎప్పటి నుంచో స్పష్టతతో ఉంది. అంతర్జాతీయ సమాజం కూడా కశ్మీర్‌ అంశాన్ని భారత్‌ అంతర్గత వ్యవహారంగానే పరిగణిస్తోంది. పాక్‌ మాత్రం మూడో వ్యక్తి ప్రమేయాన్ని కోరుతోంది.

ఇటీవల జరిగిన యూఎన్‌హెచ్‌ఆర్సీ సదస్సులో పాక్‌ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. కశ్మీర్‌ పరిస్థితులపై ఈ మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలన్న పాక్‌ డిమాండ్‌ను భారత్‌ తోసిపుచ్చింది. ఇది భారత్‌ అంతర్గత వ్యవహారమని, ఇతరుల జోక్యాన్ని ఆమోదించబోమని స్పష్టం చేసింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.