
తాజా వార్తలు
నిర్మల వ్యాఖ్యలను తోసిపుచ్చిన మారుతీ సుజుకీ
దిల్లీ: 21వ శతాబ్దపు యువత (మిలీనియల్స్) ఎక్కువగా క్యాబ్ సర్వీసులను ఆశ్రయిస్తుండడం వల్లనే ఆటోమొబైల్ రంగం కుదేలైందన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను మారుతీ సుజుకీ తోసిపుచ్చింది. ఆటోమొబైల్ రంగంలో అమ్మకాల క్షీణతకు మంత్రి చెప్పిన కారణం అంతగా ప్రభావం చూపలేదని మారుతీ సుజుకీ సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత సంక్షోభంలో క్యాబ్ సర్వీసులైన ఓలా, ఉబర్ల పాత్ర అత్యంత కనిష్ఠంగా ఉందని అభిప్రాయపడ్డారు.
‘‘వాహన రంగంలో ప్రస్తుత పరిస్థితికి ఓలా, ఊబర్ సంస్థలు కారణం కాకపోవచ్చు. తుది నిర్ణయానికి వచ్చే ముందు ఈ పరిస్థితికి దారితీసిన పరిణామాలపై మరింతగా పరిశోధన చేయాల్సి ఉంది.’’ అని మారుతీ సుజుకీ కార్యనిర్వహక డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు.
తమ వాహన అమ్మకాలు వరుసగా ఏడో నెలలో కూడా తగ్గాయని ఈ నెల ప్రారంభంలో మారుతీ సుజుకీ ప్రకటించింది. ఆగస్టులో 1,06,413 యూనిట్లతో మొత్తం అమ్మకాలు 32.7 శాతం పడిపోయినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో సాధారణ వాహనాల అమ్మకాలు 36.1 శాతం తగ్గినట్లు వెల్లడించింది.
భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తాజా లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో ఆటోమొబైల్ రంగంలో క్షీణత 15.89 శాతం కనిపించింది. ఆగస్టులో దేశీయ అమ్మకాలు 23.55 శాతం, జులైలో 18.71 శాతం, జూన్లో 12.34 శాతం, మే నెలలో 8.62 శాతం, ఏప్రిల్లో 15.93 శాతం మేర తగ్గాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
