close

తాజా వార్తలు

పది నిమిషాల్లో ఛార్జింగ్‌ ఫుల్‌

ఎన్ని సానుకూలతలున్నా బ్యాటరీ కార్లు, మోటార్‌సైకిళ్ల ఛార్జింగ్‌కి అత్యధిక సమయం పడుతుంది. ఇవి ప్రయాణించే దూరం తక్కువ. ఈ వాహనాల అమ్మకాలకు ఇవే పెద్ద ప్రతిబంధకం. దానికి చెక్‌ పెట్టేలా కేవలం పదినిమిషాల్లోనే బ్యాటరీ 80 శాతానికి పైగా ఛార్జింగ్‌ అయ్యే సరికొత్త లిథియం-అయాన్‌ బ్యాటరీ టెక్నాలజీ కనిపెట్టారు అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ టెక్నాలజీతో ఛార్జింగ్‌ చేస్తున్నప్పుడు బ్యాటరీ సెల్స్‌ అతి త్వరగా వేడెక్కేలా పలుచని నికెల్‌ రేకులను ఉపయోగించారు. దాంతోపాటు బ్యాటరీని వాడుతున్నప్పుడు ఛార్జింగ్‌ నెమ్మదిగా దిగుతుంది. ఇది రెండు విధాలా ప్రయోజనకరం. ఈ సాంకేతికతను తమ వాహనాల్లో ప్రయోగాత్మకంగా వాడటానికి ఒక ప్రముఖ బ్యాటరీ కార్ల కంపెనీ చర్చలు కొనసాగిస్తోంది. ఈ ఆవిష్కరణ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే బ్యాటరీ వాహనాల్లో సరికొత్త విప్లవం వస్తుందంటున్నారు ఆటోమొబైల్‌ నిపుణులు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.