
తాజా వార్తలు
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తనకు కాషాయ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారనీ.. కానీ తాను మాత్రం వారి ట్రాప్లో పడబోననని స్పష్టంచేశారు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళ ప్రాచీన కవి తిరువల్లూర్ చిత్రాన్ని భాజపా ట్వీట్ చేయడంపై చెలరేగిన వివాదంపై స్పందించాలని విలేకర్లు అడగ్గా.. తిరువల్లూర్తో పాటు తనపైనా కాషాయ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తమిళనాట నాయకత్వ శూన్యత ఉందని, తాను రాజకీయ పార్టీ ప్రారంభించేంత వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటానన్నారు.
నేను భాజపా వ్యక్తిని కాదు: రజనీ
రజనీకాంత్ భాజపాకు సానుకూలంగా ఉంటున్నారనీ.. 2021లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఆ పార్టీలో చేరతారంటూ వస్తోన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాను భాజపాకు చెందిన వ్యక్తి అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారనీ.. అది వాస్తవం కాదని రజనీ స్పష్టంచేశారు. ఇటీవల రాష్ట్ర భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి పోన్ రాధాకృష్ణన్తో భేటీపైనా స్పందించారు. ఆయన తనను భాజపాలోకి రావాలని ఆహ్వానించలేదన్నారు. అయోధ్యపై తీర్పు రానున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని, కోర్టు తీర్పులను గౌరవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తమిళ ప్రాచీన కవి తిరువల్లూరు నుదుటికి, భుజాలకు విభూతి, బొట్లు.. మెడలో రుద్రాక్ష దండతో ఉన్న ఫొటోను ఇటీవల భాజపా తమిళనాడు విభాగం ట్విటర్లో పోస్ట్ చేయడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
