close

తాజా వార్తలు

గుంటూరు తూర్పు నుంచి అలీ పోటీ?

గుంటూరు: సినీ నటుడు అలీ గుంటూరు నగరంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.ఈ నేపథ్యంలో గుంటూరులో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు అందజేశారు. దీన్ని పరిశీలించిన అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో ఓటరుగా నమోదై ఉన్నారని తెలుసుకుని ఆ విషయాన్ని అలీకి చెప్పారు. తనకు తెలంగాణలో ఓటు హక్కు తొలగించినా అభ్యంతరం లేదని, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించాలని ఆయన కోరారు.

గుంటూరు తూర్పు నుంచి అలీ పేరు పరిశీలన

గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు పలువురి పేర్లను దాదాపుగా ఖరారు చేశారు. తెనాలి నుంచి  ఆళ్లపాటి రాజా పేరు దాదాపు ఖరారైంది. గుంటూరు తూర్పు అసెంబ్లీ స్థానానికి సినీనటుడు అలీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు పశ్చిమకు మద్దాల గిరి, కోవెలమూడి రవీంద్ర లేకుంటే రెడ్డి, ఎస్సీ, కాపు సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం దక్కనుంది.  తాడికొండ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్న శ్రావణ్‌కుమార్‌ కాకుండా బాపట్ల ఎమ్మెల్యే మల్యాద్రి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌ పేర్లు పరిశీలిస్తున్నారు. ప్రత్తిపాడుకు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ కుమార్తె లేదా కందుకూరు వీరయ్య లేదా విశ్రాంత ఐఏఎస్‌ అధికారుల్లో ఒకరిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మంగళగిరి అసెంబ్లీ స్థానానికి చిరంజీవులు, మరుగుడు హనుమంతరావు, తిరువీధుల శ్రీనివాసరావు, కాండ్రు కమల పోటీలో ఉన్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.