close

తాజా వార్తలు

కీర్తి సురేశ్‌ కొత్త ప్రాజెక్టు ఇదే

హైదరాబాద్‌: కథానాయిక కీర్తి సురేశ్‌ కొత్త ప్రాజెక్టు ఖరారైంది. ఈ సినిమాలో ఆమెతోపాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. వర్త్‌ ఎ షాట్‌ సంస్థ తమ తొలి సినిమాగా దీన్ని నిర్మించబోతోంది. బాలీవుడ్‌ దర్శకుడు నగేశ్‌ కుకునూర్‌ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చనున్నారు. స్పోర్ట్స్‌, రొమాన్స్‌, కామెడీ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిసింది.
‘మహానటి’ తర్వాత కీర్తి సురేశ్‌ తెలుగులో (నేరుగా) నటించలేదు. 2018లో తమిళంలో ఆమె నటించిన ‘సీమరాజా’, ‘స్వామి 2’, ‘పందెం కోడి 2’, ‘సర్కార్‌’ సినిమాలు విడుదలై, మంచి టాక్‌ అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె మలయాళంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేయబోతున్నారు. అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.