close

తాజా వార్తలు

ల్యాపీ డబుల్‌.. హ్యాపీ!

రెండు తెరలు

రెండు తెరల ఫోన్‌లను చూస్తున్నాం.
ఇకపై రెండు తెరల ల్యాప్‌టాప్‌లను చూడొచ్చు.
అందుకు ఈ ‘డ్యూయల్‌ స్క్రీన్‌’ ల్యాపీలే సాక్ష్యం..
గత వారం తైవాన్‌లో జరిగిన కంప్యూటెక్స్‌-2019 కంప్యూటర్ల పండగలో ఇవి కొలువుతీరాయి.

డిచి వాడుకునే రెండు తెరల ఫోన్‌లు.. ముందు, వెనక ఏర్పాటు చేసిన తాకే తెరల ఫోన్‌లలో ఎప్పటికప్పుడు ఊహించని విప్లవాత్మకమైన మార్పులు చూస్తున్నాం. మార్కెట్‌లో వాటి సందడి అంతా ఇంతా కాదు. ఇకపై ల్యాపీల్లోనూ ఇదే తరహా వినూత్న మార్పులు చూడొచ్చు. ముఖ్యంగా రెండు తెరల ల్యాప్‌టాప్‌లు. ఎప్పుడో 2016లో యాపిల్‌ ‘టచ్‌బార్‌’తో ‘సెకండరీ డిస్‌ఫ్లే’లకు బీజం వేసింది. తర్వాత అంతలా చెప్పుకోదగ్గ మార్పులేవీ ఇతర కంపెనీల ల్యాపీల్లో చూడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ల్యాపీల ట్రెండ్‌ మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా క్వర్టీ కీప్యాడ్‌లపైనే అదనపు తెరలతో ముస్తాబవుతున్నాయి.
 

కొత్త తరానికి..

ఇప్పుడంతా మల్టీటాస్కింగే. ఒక పని చేస్తూనే మరోదానిపై ఓ కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు ఒకే తెరతో ల్యాపీని వాడడం అంటే కొంచెం కష్టమే. అదే ల్యాపీకి రెండు తెరలు ఉంటే. కచ్చితంగా అది రేపటి తరానికి సరిపడే ల్యాపీనే. ఆసుస్‌ తయారు చేసిన Zenbook ProDuo అలాంటిదే. దీంట్లో 15 అంగుళాల తెరతో పాటు క్వర్టీ కీబోర్డుపైనే అడ్డంగా 14 అంగుళాల తెరని ఏర్పాటు చేశారు. అదే ‘స్క్రీన్‌ప్యాడ్‌ ప్లస్‌’. ఈ సెకండరీ డిస్‌ప్లేలో 4కే రిజల్యూషన్‌తో వీడియోలు చూడొచ్చు. ప్రత్యేక విండో మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌తో ప్రైమరీ స్క్రీన్‌లో ఉన్న కంటెంట్‌ని సెకండరీ స్క్రీన్‌లోకి కూడా వచ్చేలా చేయొచ్చు. కావాల్సిన అప్లికేషన్లను గుత్తగా పెట్టుకుని ‘ఇన్‌స్టెంట్‌ మల్టీ-యాప్‌ లాంచ్‌’గా తెరని వాడుకోవచ్చు. ప్రైమరీ తెరపై పని చేసుకుంటూనే సిస్టంలోని ఫైల్స్‌ని సెకండరీ స్క్రీన్‌లో ఎక్స్‌ప్లోర్‌ చేయడం సులభం అవుతుంది. స్టైలస్‌తో నోట్స్‌ రాసుకోవడానికి సెకండరీ స్క్రీన్‌ ఎంతో అనుకూలం. టచ్‌ప్యాడ్‌పైనే అవసరానికి నంబర్‌ప్యాడ్‌ని యాక్సెస్‌ చేయొచ్చు. 
ఇతర వివరాలకు http:bit.ly/2IdDoIC

ఇంటెల్‌ మాయలో..

ఆసుస్‌, హెచ్‌పీలతో పాటు ఇంటెల్‌ కూడా డ్యూయల్‌ స్క్రీన్‌ ల్యాపీల తయారీలతో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. రెండు రకాల నమూనా ల్యాపీలను కంప్యూటెక్స్‌ షోలో ప్రదర్శించింది. వాటిల్లో Honeycomb Glacier ఒకటి. రెండు డిస్‌ప్లే తెరలతో దీన్ని తయారు చేశారు. 15 అంగుళాల ప్రైమరీ ప్యానల్‌ ఒకటి. 12.3 అంగుళాల సెకండీ ప్యానల్‌ మరోటి. వీటి కింద క్వర్టీ కీబోర్డు. చిత్రంలో మాదిరిగా అవసరం మేరకు రెండు స్క్రీన్‌లను వాడుకోవచ్చు. సెకండరీ స్క్రీన్‌ని కూడా అవసరం మేరకు పైకి పెట్టుకుని పని చేసుకోవచ్చు. దీంతో పాటు గి‌్రi- ళిi‌్ర’౯( పేరుతో డ్యూయల్‌ స్క్రీన్‌ ల్యాపీని పరిచయం చేసింది. 12.3 అంగుళాల రెండు తాకేతెరలతో రూపొందించారు. రెండు తెరల్ని వేరు వేరు అవసరాలకు వాడుకోవచ్చు. చిత్రంలో మాదిరిగా క్వర్టీ కీబోర్డుని జత చేసుకుని ల్యాపీని వాడుకోవచ్చు. ల్యాపీ మోడ్‌లోనే కాకుండా టెంట్‌, బుక్‌ మోడ్‌లలో  దీన్ని వాడుకోవచ్చు. 

గేమింగ్‌ ల్యాపీ..

రెండు తెరలతో తయారైన గేమింగ్‌ ల్యాప్‌టాప్‌. హెచ్‌పీ కంపెనీ రూపొందించింది. పేరు Omen X 2S..  ఈ తరహాలో అందుబాటులోకి వచ్చిన తొలి గేమింగ్‌ ల్యాపీ ఇదే. కంప్యూటెక్స్‌ షో కంటే ముందే టెక్నాలజీ ప్రియుల్ని ఆకట్టుకుంది. క్వర్టీ కీప్యాడ్‌కి, ప్రైమరీ స్క్రీన్‌కి మధ్య మరో టచ్‌స్క్రీన్‌ని ఏర్పాటు చేశారు. తెర పరిమాణం 6 అంగుళాలు. ప్రైమరీ స్క్రీన్‌లో గేమర్స్‌ గేమ్స్‌ ఆడుతూ సెకండరీ స్క్రీన్‌పై ఇతర అప్లికేషన్స్‌ని రన్‌ చేయొచ్చు. లేదంటే.. బుల్లి తెరపై గేమ్స్‌ ఆడుతూ ప్రైమరీ స్క్రీన్‌పై పని చేసుకోవచ్చు. అంటే.. ఒకే డెస్క్‌టాప్‌కి రెండు మానిటర్లు ఉన్నట్టుగా పని చేసుకోవచ్చు. 
ఇతర వివరాలకు http:bit.ly/2HNFtMi

మైక్రోసాఫ్ట్‌ సంసిద్ధం
ప్రముఖ ల్యాప్‌టాప్‌ తయారీ కంపెనీలన్నీ  డ్యూయల్‌ స్క్రీన్‌ ల్యాపీలకు తగిన హార్డ్‌వేర్‌ రూపకల్పనలో తమదైన ముద్ర వేస్తున్నాయి. అయితే, వీటికి తగిన ఓఎస్‌ లేనప్పుడు ల్యాపీల మూల ప్రయోజనం యూజర్లకు చేరదు. ఈ నేపథ్యంలో ల్యాపీలకు తగిన సాఫ్ట్‌వేర్‌ని అందించడంలో మైక్రోసాఫ్ట్‌ ప్రధాన భూమికను పోషించనుంది. విండోస్‌ ఓఎస్‌లో తగిన మార్పులు చేసి డ్యూయల్‌ స్క్రీన్‌ ల్యాపీలకు అందించాలి. దీంట్లో భాగంగానే వినూత్న మార్పులతో ప్రత్యేక ఓఎస్‌ని విండోస్‌ రూపొందించే పనిలో ఉందని టెక్నాలజీ విశ్లేషకుల అంచనా.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.