close

తాజా వార్తలు

ఒత్తిడి తగ్గాలా... పని ఆపేయండి

పనిలో ఒత్తిడి మామూలే. ఆ ప్రభావం మీ పై పడకుండా ఉండాలంటే ఏం చేయాలో చూడండి.

* మీరు పనిచేసే చోటు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. అనవసర కాగితాలు, వృథా అనుకున్న ఇతర వస్తువుల్ని తీసేసి చూడండి. మార్పు మీకే కనిపిస్తుంది.
* మీ దినచర్య మొదలుకాకముందే ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచించుకోవడం అవసరం. మీ పనికో ప్రణాళిక పెట్టుకుంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి. వీలైనంతవరకూ పనుల్ని వాయిదా వేసుకోకుండా చూసుకోవాలి. ఓ పని విషయంలో ఎదురయ్యే అడ్డంకులనూ అంచనా వేయగలగాలి.
* రోజంతా కష్టపడినా పనులు తరిగిపోవు. అందుకే అదేపనిగా పనుల్లోనే ఉండిపోకుండా ప్రతి గంటన్నర లేదా రెండుగంటలకోసారి విరామం తీసుకోండి. కనీసం ఐదునిమిషాల సేపు పని నుంచి ధ్యాస మళ్లినా చాలు.
* ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే... మీరు పనిచేసేచోట ఓ పచ్చటి మొక్క, కుటుంబసభ్యుల ఫొటో వంటివి ఏర్పాటు చేసుకోండి. మనసుకు సాంత్వన కలుగుతుంది.
* విపరీతంగా ఒత్తిడికి గురవుతున్నప్పుడు పని చేయకండి. పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. బదులుగా కనీసం పావుగంటసేపు విశ్రాంతి తీసుకోవడమే మంచిది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.