close

తాజా వార్తలు

పోలవరం పనులు ప్రారంభించిన మేఘా

పోలవరం: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు పనులను మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ శుక్రవారం ప్రారంభించింది. ఈ మేరకు స్పిల్‌వే వెనుక భాగంలో సంస్థ ప్రతినిధులు భూమి పూజ చేశారు.

అనుకున్న సమయానికి పోలవరం పూర్తి: మంత్రి అనిల్
అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేయాలో నిర్ణయించుకున్నామని, చెప్పినట్లుగానే ఇవాళ్టి నుంచి పోలవరం పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. సీఎం జగన్‌ ఒకసారి మాట ఇచ్చారంటే తప్పే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వమే ఆర్‌అండ్‌ఆర్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.