close

తాజా వార్తలు

చక్కెర వద్దు...బెల్లం మేలు!

తీపి తినాలనుకుంటే చక్కెరే అవసరంలేదు. దానికి ప్రత్యామ్నాయంగా బెల్లం ఎంచుకోవచ్చు. రుచితోపాటు ఆరోగ్యాన్ని అందించే బెల్లం ఎన్నోరకాలుగా మేలు చేస్తుంది.  

* చలికాలంలో బెల్లం   తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన వెచ్చదనం లభిస్తుంది. ఇందులో క్యాల్షియం ఉంటుంది. ఇది  ఎముకలను దృఢంగా ఉంచుతుంది.  
* దీనిలో ఇనుము, ఫాస్ఫరస్‌ మూలకాలు ఉంటాయి. ఇవి రక్తహీనత సమస్య ఎదురుకాకుండా చేస్తాయి. రక్తవృద్ధికి తోడ్పడతాయి. రక్తాన్నీ శుద్ధిచేసే గుణం దీనికి ఉంది.  గర్భిణులు  దీన్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల రకరకాల వ్యాధులు, అలర్జీల బారిన పడకుండా చూసుకోవచ్చు.  
* చక్కెర బదులు దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరస్థాయులు అదుపులో ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. దీన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్యా ఉండదు.
* బెల్లం తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కంటి చూపు బాగుంటుంది. ఇది డిటాక్స్‌లా పనిచేసి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. బరువూ నియంత్రణలో ఉంటుంది.
* రోజుకో చిన్న బెల్లంముక్క తినే మహిళల్లో నెలసరి సమయంలో ఎదురయ్యే సమస్యలు చాలామటుకూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పొట్టనొప్పి, తలనొప్పి వంటివి అదుపులో ఉంటాయి.
* నీరసంగా అనిపించినప్పుడు చిన్న బెల్లంముక్క నోట్లో వేసుకుని చూడండి. అప్పటికప్పుడు శక్తి అందుతుంది.  
* సమయం ఉన్నప్పుడు బెల్లంతో చిక్కీలు, రకరకాల పదార్థాలు కలిపి ఎనర్జీ బార్స్‌ చేసుకోండి. పాలల్లోనూ చక్కెరకు బదులు బెల్లం వేసుకుని చూడండి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.