close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ధైర్యంగా ఉండండి.. నిబ్బరం కోల్పోవద్దు! 

లండన్ తెలుగు విద్యార్థులతో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ 

అమరావతి: లండన్‌లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన పలువురు విద్యార్థులను భారత్‌కు తీసుకువచ్చేలా తక్షణం చర్యలు చేపడతామని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భరోసా ఇచ్చారు. కోవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. ఈ క్రమంలో చివరి నిమిషంలో లండన్‌లోని హిత్రో విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు విద్యార్థులు, ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారితో ఏపీ సీఐడీ (ఎన్‌ఆర్‌ఐ సెల్), ఏపీ ఎన్ఆర్‌టీ సమన్వయంతో ఏర్పాటు చేసిన దృశ్య శ్రవణ సమీక్ష సమావేశం (వీడియో కాన్ఫరెన్స్‌)లో డీజీపీ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి డీజీపీకి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తక్షణమే తమను భారత దేశానికి తీసుకొని వచ్చేందుకు అన్నీ చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరారు. దీనిపై స్పందించిన డీజీపీ తక్షణమే సమస్యను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లి, త్వరితగతిన భారతదేశానికి తీసుకొని వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఏపీ సీఐడీ (ఎన్‌ఆర్‌ఐ సెల్) అధికారులు, ఏపీ ఎన్ఆర్‌టీ ప్రతినిధులు విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉండాలని డీజీపీ సూచించారు. సమావేశంలో సీఐడీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్, డీఐజీ హరికృష్ణ, ఎస్పీ జి‌.ఆర్.రాధిక, ఏపీ ఎన్ఆర్‌టీ అధ్యక్షులు మేడపాటి వెంకట్ తో పాటు పలువురు అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


మరిన్ని