Rajasthan: మాన్‌సూన్‌ ట్రిప్‌ ప్లాన్‌ ఉంటే.. ఈ ప్లేస్‌ల మీద ఓ లుక్కేయండి!

వర్షకాలం వచ్చేసింది.. ఈ సీజన్‌లోనూ ట్రిప్‌లు వేసే అలవాటు మీకు ఉందా? అయితే మీ తరువాతి వెకేషన్‌గా రాజస్థాన్‌ను ట్రై చేయొచ్చు!

Updated : 28 Jul 2023 16:58 IST
1/6
రాజస్థాన్‌లోని విలాసవంతమైన వృక్ష సంపద, అద్భుతమైన అందాలను సందర్శించాలంటే వర్షాకాలం మంచి సమయం. కోటలు, రాజ భవనాలు విద్యుత్తు కాంతులతో మెరిసిపోతుంటాయి. మరి ఆ ప్రాంతాలేంటో చూద్దామా! రాజస్థాన్‌లోని విలాసవంతమైన వృక్ష సంపద, అద్భుతమైన అందాలను సందర్శించాలంటే వర్షాకాలం మంచి సమయం. కోటలు, రాజ భవనాలు విద్యుత్తు కాంతులతో మెరిసిపోతుంటాయి. మరి ఆ ప్రాంతాలేంటో చూద్దామా!
2/6
భాంఘర్ కోట: శిథిలావస్తలో ఉన్నప్పటికి నిర్మలమైన పచ్చటి పరిసరాల మధ్య భాంఘర్ కోట ఇప్పటికీ అందంగానే కనిపిస్తుంది. ఆసక్తిని కలిగించే వాస్తవాలు, దెయ్యాల పురాణాలు ఉన్న భాంఘర్ కోట తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం పర్యటకులు చెబుతుంటారు. భాంఘర్ కోట: శిథిలావస్తలో ఉన్నప్పటికి నిర్మలమైన పచ్చటి పరిసరాల మధ్య భాంఘర్ కోట ఇప్పటికీ అందంగానే కనిపిస్తుంది. ఆసక్తిని కలిగించే వాస్తవాలు, దెయ్యాల పురాణాలు ఉన్న భాంఘర్ కోట తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం పర్యటకులు చెబుతుంటారు.
3/6
కియోలాడియో ఉద్యానవనం: వలస పక్షుల అందాలను వీక్షించాలంటే... రాజస్థాన్‌లోని కియోలాడియో జాతీయ ఉద్యానవనం బాగుంటుంది. శీతాకాలంలో పాలియార్కిటిక్‌ ప్రాంతం నుంచి వలస వచ్చే నీటి పక్షులు ఇక్కడ కనిపించి అలరిస్తాయి. కియోలాడియో ఉద్యానవనం: వలస పక్షుల అందాలను వీక్షించాలంటే... రాజస్థాన్‌లోని కియోలాడియో జాతీయ ఉద్యానవనం బాగుంటుంది. శీతాకాలంలో పాలియార్కిటిక్‌ ప్రాంతం నుంచి వలస వచ్చే నీటి పక్షులు ఇక్కడ కనిపించి అలరిస్తాయి.
4/6
జల్‌ మహల్‌: మహారాజా మధో సింగ్‌ 1 జల్ మహల్‌ను నిర్మించారు. దీనిని వాటర్‌ ప్యాలెస్‌ అని కూడా పిలుస్తారు. ఈ ప్యాలెస్‌ సాంప్రదాయ రాజపుత్ర నమూనాను అనుసరిస్తూ, గులాబీ ఇసుకరాయితో నిర్మించారు. మాన్‌ సాగర్‌ సరస్సు మధ్యలో ఉండే ఈ ప్యాలెస్‌ను బాతుల వేటకు వెళ్లినప్పుడు రాజు, అతని సైన్యం  విడిదిగా ఉపయోగించుకునేవారట. జల్‌ మహల్‌: మహారాజా మధో సింగ్‌ 1 జల్ మహల్‌ను నిర్మించారు. దీనిని వాటర్‌ ప్యాలెస్‌ అని కూడా పిలుస్తారు. ఈ ప్యాలెస్‌ సాంప్రదాయ రాజపుత్ర నమూనాను అనుసరిస్తూ, గులాబీ ఇసుకరాయితో నిర్మించారు. మాన్‌ సాగర్‌ సరస్సు మధ్యలో ఉండే ఈ ప్యాలెస్‌ను బాతుల వేటకు వెళ్లినప్పుడు రాజు, అతని సైన్యం విడిదిగా ఉపయోగించుకునేవారట.
5/6
నహర్‌ఘర్‌ ఫోర్ట్‌: 18వ శతాబ్దంలో సవాయి మాధో సింగ్ నిర్మించిన అద్భుతమైన కట్టడం నహర్‌ఘర్‌ ఫోర్ట్‌.  పేరు కొత్తగా ఉంది కదా... దీని అర్థం పులుల నివాసం.  మరి పులుల ఘర్‌ వీక్షిస్తారా! నహర్‌ఘర్‌ ఫోర్ట్‌: 18వ శతాబ్దంలో సవాయి మాధో సింగ్ నిర్మించిన అద్భుతమైన కట్టడం నహర్‌ఘర్‌ ఫోర్ట్‌. పేరు కొత్తగా ఉంది కదా... దీని అర్థం పులుల నివాసం. మరి పులుల ఘర్‌ వీక్షిస్తారా!
6/6
అమేర్‌ కోట: దేశంలోని అత్యంత అద్భుతమైన ప్యాలెస్‌ల్లో అమేర్‌ కోట ఒకటి. జైపూర్‌కు 11 మైళ్ల దూరంలో కొండపై ఈ కోట ఉంది. గులాబీ, పసుపు వర్ణం ఇసుక రాయితో ఈ కోట నిర్మించారు. దీనిని అంబర్ ఫోర్ట్‌ అని కూడా పిలుస్తారు. అమేర్‌ కోట: దేశంలోని అత్యంత అద్భుతమైన ప్యాలెస్‌ల్లో అమేర్‌ కోట ఒకటి. జైపూర్‌కు 11 మైళ్ల దూరంలో కొండపై ఈ కోట ఉంది. గులాబీ, పసుపు వర్ణం ఇసుక రాయితో ఈ కోట నిర్మించారు. దీనిని అంబర్ ఫోర్ట్‌ అని కూడా పిలుస్తారు.

మరిన్ని