త్వరలోనే సీఏఏ అమలు: నడ్డా

తాజా వార్తలు

Published : 19/10/2020 19:02 IST

త్వరలోనే సీఏఏ అమలు: నడ్డా

సిలిగురి (బెంగాల్‌): దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని త్వరలోనే అమలు చేస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఈ చట్టం అమలులో జాప్యం ఏర్పడిందన్నారు. ఉత్తర బెంగాల్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా విభజించి పాలించే రాజకీయాలను సాగిస్తోందని ఆరోపించారు. భాజపాలా అందరి అభివృద్ధి కోసం పని చేయడంలేదని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో కూడా ఈ బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. ఈ చట్టం అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని నడ్డా స్పష్టంచేశారు.

కరోనాతో ఏర్పడిన పరిస్థితులు ప్రస్తుతం మెరుగుపడుతున్న తరుణంలో అతి త్వరలోనే సీఏఏ అమలు చేయనున్నట్టు తెలిపారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి 2021లో జరగబోయే ఎన్నికల్లో భాజపానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. మమతా బెనర్జీ హయాంలో హింసాత్మక రాజకీయాలకు, కట్‌-మనీ సంస్కృతికి ప్రజలు విసిగిపోయారని నడ్డా వ్యాఖ్యానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని