సీపీఐ సీనియర్‌ నేత గుండా మల్లేశ్‌ కన్నుమూత

తాజా వార్తలు

Updated : 13/10/2020 16:14 IST

సీపీఐ సీనియర్‌ నేత గుండా మల్లేశ్‌ కన్నుమూత

హైదరాబాద్‌: సీపీఐ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ (75) కన్నుమూశారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. పార్టీలో కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన.. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడిగా కార్మికుల మన్ననలు పొందారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కమిటీ సభ్యుడిగా మల్లేశ్‌ పనిచేశారు. 

సీనియర్‌ నేతల సంతాపం

గుండా మల్లేశ్‌ మృతి పట్ల సీపీఐ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్‌ నేతలు డి.రాజా, నారాయణ.. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో పాటు అజీజ్‌పాషా తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మల్లేశ్‌ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.‌ ఆయన భౌతిక కాయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌కు తరలించనున్నారు. అక్కడ వామపక్ష పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు నివాళులర్పించనున్నారు. అనంతరం మల్లేశ్‌ పార్థివ దేహాన్ని బెల్లంపల్లి తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని