ఫాసిస్ట్‌ మూకలు రెచ్చిపోతున్నాయి: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 12/12/2020 01:41 IST

ఫాసిస్ట్‌ మూకలు రెచ్చిపోతున్నాయి: చంద్రబాబు

అమరావతి: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద తెలుగుదేశం పార్టీ నేతలపై వైకాపా దాడిని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తెదేపా నేతలను గాయపర్చడం, వారి వాహనాలను ధ్వంసం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బి.కొత్తకోటలో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న నాయకులపై దాడి గర్హనీయమన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ఫాసిస్ట్‌ పాలనకు ఈ దాడులు అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు. 

‘రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లాకు గండికొట్టారు. జగన్‌ అండతో వైకాపా ఫాసిస్ట్‌ మూకలు రెచ్చిపోతున్నాయి. ఏ నేరానికి పాల్పడినా ఎవరేం చేయరనే ధీమాతో నిందితులంతా పేట్రేగిపోతున్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది. మృతుల కుటుంబాల పరామర్శకు వెళ్లే నాయకులపై కూడా దాడిచేయడం ఫాసిస్ట్‌ చర్య. ఏడాదిన్నరగా రాష్ట్రంలో అశాంతి, అభద్రత నెలకొంది. ఎక్కడా శాంతిభద్రతలు లేకుండా నేరగాళ్ల రాజ్యం తెచ్చారు. బడుగు, బలహీనవర్గాలపై దాడులు జరగని రోజు లేదు. ప్రతి రోజూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దమనకాండ యథేచ్ఛగా కొనసాగుతోంది. నేరగాళ్ల అరాచకాలను నియంత్రించే వ్యవస్థే లేకుండా పోయింది. జగన్‌ సీఎం అయ్యాక పోలీసు వ్యవస్థ సరిగా లేదు. రాష్ట్రంలోని పేదలు, సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 

ఇదీ చదవండి..

తెదేపా నేతలపై వైకాపా శ్రేణుల దాడి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని