‘నా సవాలుకు స్పందించకుండా తోక ముడిచారు’

తాజా వార్తలు

Published : 13/10/2020 01:34 IST

‘నా సవాలుకు స్పందించకుండా తోక ముడిచారు’

దిల్లీ: ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పునరుద్ఘాటించారు. రాజధాని కొనసాగింపునకు రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమంటూ తాను విసిరిన సవాలుకు స్పందించకుండా తోకముడిచారని ఆయన వ్యాఖ్యానించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామకృష్ణరాజు మాట్లాడారు. అమరావతి ఉద్యమం 300 రోజులుగా కొనసాగుతున్న నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను నాశనం చేశారని.. న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం కొనసాగుతోందని ఆరోపించారు. 

మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వ్యవస్థలను భ్రష్టు పట్టించడం తగదని పరోక్షంగా వైకాపా నేతలను ఉద్దేశించి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన దిశగా వెళ్లే ప్రమాదం ఉందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఫొటోలతో డీపీ పెట్టుకొన్న కొంతమంది వ్యక్తులు తనను అసభ్యకరంగా దూషిస్తూ మెసేజ్‌లు పంపుతున్నారని చెప్పారు. జగన్ సీఎం అయ్యాక దళితులపై దాడులు పెరిగాయని.. గత సంవత్సర కాలంలో దళితులపై 30 దాడులు జరిగాయని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దళితులపై జరుగుతున్న దాడులపై తన సొంత ఖర్చుతో న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని