గెలిచిన వాళ్లలో 81% మంది కోటీశ్వరులే..!

తాజా వార్తలు

Published : 11/11/2020 21:07 IST

గెలిచిన వాళ్లలో 81% మంది కోటీశ్వరులే..!

దిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన మూడింట రెండొంతుల మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తేలింది. అలాగే వివిధ పార్టీల నుంచి గెలిచిన వారిలో 81 శాతం మంది కోటీశ్వరులని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్)‌ విశ్లేషించింది. మొత్తం 243 మంది సభ్యుల్లో 241మంది అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించింది. 163 మంది (68శాతం)పై క్రిమినల్‌ కేసులు ఉండగా.. అందులో 123 మంది (51శాతం)పై హత్య, హత్యాయత్నం వంటి తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 58 శాతం మందిపైనే కేసులు ఉన్నట్టు తెలిపింది. 

ఆర్జేడీ నుంచి గెలుపొందిన 74మందిలో 54 మందిపై, భాజపా నుంచి గెలుపొందిన 73 మందిలో 47 మంది; జేడీయూ నుంచి గెలుపొందిన 43 మందిలో 20 మందిపై; కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన 19 మందిలో 10 మందిపై; సీపీఐ (ఎంఎల్‌) నుంచి గెలుపొందిన 12 మందిలో 10 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మజ్లిస్‌ నుంచి గెలిచిన ఐదుగురిపైనా కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ తెలిపింది.

ఇక 241 మంది అఫిడవిట్లను విశ్లేషించినప్పుడు 194 మంది (81 శాతం) కోటీశ్వరులు అని తేలింది. భాజపా (65), ఆర్జేడీ (64), జేడీయూ (43), కాంగ్రెస్‌ (14) అభ్యర్థులు కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏడీఆర్‌ విశ్లేషించింది. సరాసరి ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ.4.32 కోట్లు అని వెల్లడించింది. గెలుపొందిన వారిలో  25-50 మధ్య వయసున్న వారు 115 మంది కాగా.. 51 -80 మధ్య వయసున్న వారు 126 మంది ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని