రివర్స్‌ గ్రోత్‌ సీఎంగా జగన్: యనమల

తాజా వార్తలు

Published : 26/07/2020 10:24 IST

రివర్స్‌ గ్రోత్‌ సీఎంగా జగన్: యనమల

అమరావతి: రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నాయని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఏడాది పాలనలో వైకాపా ప్రభుత్వం చేసిన అప్పులు, ఏపీ 30 ఏళ్ల అప్పులకు సమానమని ఆయన ఎద్దేవా చేశారు. 2024కు వడ్డీ, అసలు చెల్లింపులకే రూ.లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తుందని యనమల పేర్కొన్నారు. అత్యధిక గ్యారంటీస్‌లో 4వ స్థానం, అత్యధిక అప్పుల్లో 6వ స్థానంలో ఏపీ ఉందన్నారు. చేతగాని పాలనతో ఏపీ క్రెడిట్‌ రేటింగ్‌ దారుణంగా పడిపోయిందని విమర్శించారు.

రివర్స్‌ టెండరింగ్‌తోపాటు, ‘ రివర్స్‌ గ్రోత్‌ సీఎంగా జగన్‌ చరిత్ర సృష్టించారని యనమల ఎద్దేవా చేశారు. భూముల వేలం ‘ బిల్ట్‌ ఏపీ మిషన్‌ కాదు.. బిల్ట్‌ వైకాపా మిషన్‌’ అని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ బ్యాడ్‌ విల్‌తో ఏపీకి ఉన్న గుడ్‌విల్‌ పోయిందని ఆరోపించారు. తప్పొప్పుల సమీక్షకు జగన్‌ జమానాలో చోటు లేదని, గత 14 నెలల్లో ఏపీకి వాటిల్లిన నష్టానికి సీఎందే పూర్తి బాధ్యత యనమల ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని