అశోక్‌ గజపతికి ధర్మకర్త హోదా తొలగింపు

తాజా వార్తలు

Published : 03/01/2021 02:22 IST

అశోక్‌ గజపతికి ధర్మకర్త హోదా తొలగింపు

అమరావతి: రామతీర్థంలో విగ్రహ ధ్వంసంపై ఓవైపు తెలుగుదేశం నేతల నిరసన కొనసాగుతుండగానే కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు రామతీర్థం, పైడితల్లి, మందపల్లి దేవస్థానాల ధర్మకర్తగా ఉన్న గజపతిరాజును ఆ హోదా నుంచి తొలగించింది. ఈ మేరకు ఆయనను తొలగిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆలయాలకు ధర్మకర్తగా నియమిస్తూ గతంలో ఇచ్చిన జీవో 65ను ఉపసంహరిస్తూ దేవదాయశాఖ తాజాగా మెమో జారీ చేసింది. ఆలయ నిర్వహణలో విఫలమయ్యారనే అశోక్‌ను ధర్మకర్తగా హోదా నుంచి తొలగిస్తున్నట్లు దేవాదాయశాఖ వెల్లడించింది. రాముడి విగ్రహం ధ్వంసానికి విధుల్లో నిర్లక్ష్యమే కారణమని ఉత్తర్వుల్లో దేవాదాయశాఖ పేర్కొంది.

ఇవీ చదవండి..

రామతీర్థం రణరంగం

రామతీర్థంలో రాజకీయ వేడి   


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని