భూముల అమ్మకానికి వ్యతిరేకం: సంజయ్‌
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భూముల అమ్మకానికి వ్యతిరేకం: సంజయ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుల కోసం సర్కారు భూములు అమ్మడాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. రాష్ట్రంలోని భూమి తెలంగాణ ప్రజల ఆస్తి.. రాష్ట్ర ప్రభుత్వం సంరక్షకుడిగా ఉండాలి తప్ప వాటిని అమ్మే అధికారం ఉండదన్నారు.

 ‘‘రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను ప్రజల సౌకర్యాల కోసం వినియోగించాలి తప్ప విక్రయించడం అనైతికం. పేదలకు ఇళ్ల స్థలాలు,  ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాలయాలు, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, స్టేడియంలు, బస్‌ స్టేషన్లు, గిడ్డంగుల నిర్మాణాల కోసం ఉపయోగించుకోవాలి తప్ప విక్రయించడం సరైంది కాదు. హైదరాబాద్‌, ఇతర నగరాల చుట్టూ ఉన్న విలువైన భూములను అమ్మాలని నిర్ణయించడం తెలంగాణ ప్రజలను నట్టేట ముంచడమే. ఇప్పటికే పలు ప్రభుత్వ, అసైన్డ్‌, శిఖం, అటవీ, దేవాదాయ, భూదాన, వక్ఫ్‌, భూ సంస్కరణల మిగులు భూములు అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. భూమి అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూగా  మార్చుకోవాలనుకోవడం దురదృష్టకరం. గతంలో తెదేపా, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు భూములు వేలం వేయడాన్ని భాజపా వ్యతిరేకించింది. ప్రభుత్వం భూముల అమ్మకాన్ని ఆపి.. రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. లేని పక్షంలో భాజపా.. ప్రజా ఉద్యమంతో పాటు న్యాయ పోరాటం చేస్తుందని’’  బండి సంజయ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని