హక్కుల కోసం సభలో కొట్లాడుతాం: రఘునందన్‌
close

తాజా వార్తలు

Updated : 13/03/2021 14:22 IST

హక్కుల కోసం సభలో కొట్లాడుతాం: రఘునందన్‌

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై భాజపా దృష్టి సారించింది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రఘునందన్‌రావులతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై బండి సంజయ్‌ దిశా నిర్దేశం చేశారు. గతంలో భాజపా నుంచి రాజాసింగ్‌ మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. దుబ్బాకలో రఘునందన్‌రావు విజయంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకి చేరింది. తమకు కేటాయించే సమయాన్ని సద్వినియోగం చేసుకుని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా భాజపా వ్యూహం రచిస్తోంది.

సమావేశం ముగిసిన అనంతరం రఘునందన్‌రావు  మీడియాతో మాట్లాడారు. ‘‘ భైంసా అల్లర్లు, నిరుద్యోగభృతి, పీఆర్సీ అంశాలు సభలో లేవనెత్తుతాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తప్పునీ సభలో ఎండగడతాం. ప్రభుత్వాన్ని సరైన రీతిలో నడిపించేందుకు భాజపా సలహాలు, సూచనలు ఇస్తుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏ పథకానికి నిలిచిపోయాయో సభలో చెప్పాలి. ప్రజలు, సభ్యుల హక్కుల కోసం సభలో కొట్లాడుతాం. గాంధేయ మార్గంలో నిరసన తెలిపే హక్కు ఉంది. భైంసా అల్లర్లకు, భాజపాకు సంబంధం ఉంటే కేసులు ఎందుకు పెట్టలేదు. డీజీపీ అనుమతిస్తే భైంసా వెళ్లి బాధితులను పరామర్శిస్తాం. హరీశ్‌రావు సిద్దిపేటకే ఆర్థికమంత్రా? రాష్ట్రానికా? అని సభలో అడుగుతా. జీహెచ్‌ఎంసీ ఫలితాలే పట్టభద్రుల ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయి’’ అని రఘునందన్‌రావు అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని