ఓరుగల్లు పురపోరులో ‘ఒంటెల’ ప్రచారం

తాజా వార్తలు

Published : 28/04/2021 01:09 IST

ఓరుగల్లు పురపోరులో ‘ఒంటెల’ ప్రచారం

వరంగల్‌: వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. కనీవిని ఎరుగని రీతిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో 41వ డివిజన్‌ భాజపా అభ్యర్థి ఒంటెలతో ప్రచారం నిర్వహించారు. ఒంటెలను కాషాయ కండువాలు, జెండాలతో అలంకరించి డివిజన్‌ పరిధిలోని అన్ని కాలనీల్లో సంచరిస్తూ కమలం గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. ఒంటెలపై ప్రచారం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా ఓటర్లకు కొత్తరకం అనుభూతిని పంచినట్లైంది. ఈ ‘ఒంటెల’ ప్రచారాన్ని స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని