నీతీశ్‌పై భాజపా ఎమ్మెల్సీ కామెంట్‌: బిహార్‌లో దుమారం
close

తాజా వార్తలు

Published : 05/06/2021 01:18 IST

నీతీశ్‌పై భాజపా ఎమ్మెల్సీ కామెంట్‌: బిహార్‌లో దుమారం

పట్నా: బిహార్‌లో భాజపాతో జనతాదళ్‌(యునైటెడ్‌) కూటమిగా ఏర్పడి, అధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా కూటమి నీతీశ్‌ కుమార్‌నే ముఖ్యమంత్రిగా ఎంచుకుంది. కాగా ఆయనపై తాజాగా భాజపాకు చెందిన ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. దీంతో భాజపా నష్టనివారణ చర్యలు చేపట్టింది.

భాజపా ఎమ్మెల్సీ టున్నా పాండే సీఎం నీతీశ్‌ కుమార్‌ గురించి మాట్లాడుతూ.. పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. బిహార్‌ ప్రజలు ఆర్జేడీకి అధికారం వచ్చేలా తీర్పునిస్తే.. నీతీశ్‌ కుమార్‌ అధికారాన్ని దొంగలించి సీఎం అయ్యారని పేర్కొన్నారు. దీంతో టున్నా పాండేపై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. మిత్రపక్ష నేత, రాష్ట్ర సీఎంపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించడంతోపాటు పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరించింది. ఈ మేరకు టున్నా పాండేకు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్‌ జైశ్వాల్‌ నోటీసులు జారీ చేశారు. మరోవైపు సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని బిహార్‌ భాజపా క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపింది. కాగా.. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటానని పాండే వెల్లడించారు. ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలను పార్టీకి వివరిస్తానని తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని