ముగిసిన బుగ్గన దిల్లీ పర్యటన

తాజా వార్తలు

Published : 30/01/2021 00:40 IST

ముగిసిన బుగ్గన దిల్లీ పర్యటన

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన స్టేట్ డెవలప్‌మెంట్ రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించాలని.. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల పర్యటనపై దిల్లీ వెళ్లిన బుగ్గన.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, జలశక్తి శాఖ కార్యదర్శి, పౌర విమానాయన శాఖ ఉన్నతాధికారులను కలిశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కు వివరించినట్లు చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి పునరావసం, పరిహారం అంశంలో కొత్త అంచనాలను ఆమోదించేలా చూడాలని కోరినట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఒర్వకల్లు విమానాశ్రయం ప్రారంభోత్సవం, కమర్షియల్ విమానాల రాకపోకలపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించినట్లు వివరించారు. అప్పర్ సీలేరు ప్రాజెక్టు రివర్స్ పంపింగ్‌తో విద్యుత్ ఆదా అవుతుందని.. ఆ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కోరినట్లు మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి..

ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌పై చర్యలు: నిమ్మగడ్డ

ఏపీలో 1నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని